రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దంపతులు తమ ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాత్రూంలో ఉన్న వారి ఐదేళ్ల కుమారుడు స్పృహతప్పి పడిపోయాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు.
గీజర్ నుండి గ్యాస్ లీక్ అయి.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకు కలకలం రేపుతున్నాయి. ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భిల్వారా జిల్లాలో దంపతులు తమ ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాత్రూంలో ఐదేళ్ల కుమారుడు కూడా స్పృహతప్పి పడిపోయాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు. గీజర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక దంపతులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.
వివరాలిలా ఉన్నాయి.. హోలీని పురస్కరించుకుని శివనారాయణ ఝన్వర్ (37), అతని భార్య కవితా ఝన్వర్ (35), కుమారుడు విహాన్ చాలా సంతోషంగా గడిపారు. స్నానానికి వెళ్లి గ్యాస్ గీజర్‌ను ఆన్ చేశారు. అయితే గ్యాస్ లీకేజీని గమనించలేదని పోలీసు అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటలకు పైగా ముగ్గురు బాత్‌రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టినా స్పందన లేదు. వారు తలుపు పగులగొట్టి, గీజర్ ఆన్‌లో ఉండగా వారు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ముగ్గురిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, బిడ్డ చికిత్స పొందుతుండగా.. దంపతులు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని అధికారి తెలిపారు.
పోలీసు రికార్డుల ప్రకారం దాదాపు గంట గడిచిన తర్వాత వారు అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారని వారి పిల్లలు గుర్తించారు. మురాద్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షకు పంపామని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ద్వారా నీటిని వేడి చేస్తూ ఉంటారు. కరెంట్ గీజర్ కంటే గ్యాస్ గీజర్లతో డబ్బులు ఆదా చేయొచ్చని భావిస్తారు. ఈ ఇలాంటి గీజర్లు వాడినప్పడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలనీ, మరీ క్లోజ్ చేసిన ప్రదేశాల్లో ఉంచడం ప్రమాదకరం. ఇరుకైన బాత్రూమ్ లో కచ్చితంగా ఎక్స్హాస్ట్ ఫ్యాన్లు ఆన్ చేసి ఉంచుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
