Asianet News TeluguAsianet News Telugu

భారత్ బంద్ : పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ తగ్గించిన వసుంధరా రాజే

రోజు రోజుకు చుక్కల్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 21 పార్టీలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Rajasthan CM Vasundhara Raje reduction against 4-per cent  in VAT on petrol and diesel
Author
Rajasthan, First Published Sep 10, 2018, 12:20 PM IST

రోజు రోజుకు చుక్కల్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 21 పార్టీలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది..

అయితే బంద్ రోజున కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగింది. లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. ఇదిలా ఉండగా... బంద్ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను 4 శాతం తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆ రాష్టరంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.

Follow Us:
Download App:
  • android
  • ios