రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జల్‌వార్‌లోని జల్‌రపతాన్ నియోజకవర్గం బూత్ నెం 31ఎలో ఆమె ఓటు వేశారు. మహిళలు ఓటు వేయడానికి అనువుగా అధికారులు పింక్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 200 పింక్ పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 200 స్థానాలనున్న రాజస్థాన్ శాసనసభలో... రామ్‌గఢ్ బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు.
మిగిలిన 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... వీరిలో 189 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Scroll to load tweet…
Scroll to load tweet…