సొంత ప్రభుత్వంపై విమర్శలు : గెహ్లాట్ ఆగ్రహం , కేబినెట్ నుంచి రాజేంద్ర సింగ్‌కి ఉద్వాసన .. బీజేపీ విమర్శలు
సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి రాజేంద్ర సింగ్ గూడాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అసెంబ్లీలో మణిపూర్ అంశంపై ప్రకటన చేస్తూ .. సొంత ప్రభుత్వంపైనే రాజేంద్ర ప్రశ్నలు సంధించారు.

మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా కలకం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ మంత్రి , కాంగ్రెస్ నేత రాజేంద్ర గూడా శుక్రవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ సంగతి తర్వాత ముందు మన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గ్లెహాట్.. రాజేంద్ర గూడాను మంత్రి పదవి నుండి తొలగించారు. రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ రాజేంద్ర గూడా అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీలో మణిపూర్ అంశంపై ప్రకటన చేస్తూ .. సొంత ప్రభుత్వంపైనే రాజేంద్ర ప్రశ్నలు సంధించారు.
రాజస్థాన్‌లో మహిళల భద్రత విషయంలో మా ప్రభుత్వం విఫలమైంది. మణిపూర్‌పై వ్యాఖ్యానించే ముందు మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి అంటూ రాజేంద్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గ్లెహాట్ ..మంత్రి రాజేంద్ర గూఢాను తొలగించాల్సిందిగా గవర్నర్ కలరాజ్ మిశ్రాకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి సిఫార్సుకు గవర్నర్ వెంటనే అంగీకరించారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే రాజేంద్ర గూడను మంత్రి పదవి నుంచి తొలగించడం వెనుక గల కారణాలను అధికారిక ప్రకటనలో పేర్కొనలేదు.
దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. నిజాన్ని అంగీకరించే దమ్ము సీఎంకు లేదు! తన సొంత మంత్రి రాజేంద్ర గూడా అసెంబ్లీలో నిజం చెప్పినప్పుడు, గెహ్లాట్ ఎంతో కష్టపడ్డారు. నిజాలు చెప్పినందుకే రాజస్థాన్ మంత్రి పదవి నుంచి రాజేంద్ర గూఢాను తొలగించారని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేశారు. ప్రేమ దుకాణంలో నిజాయితీ గల కస్టమర్‌లకు చోటు లేదు.. ఇక్కడ అవినీతిపరులు, అబద్దాలకు మాత్రమే స్వాగతమంటూ బీజేపీ వ్యాఖ్యానించింది.