Asianet News TeluguAsianet News Telugu

Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్ మినహా.. మొత్తం కేబినెట్ రాజీనామా

రాజస్థాన్‌లో (Rajasthan) సీఎం అశోక్ గెహ్లాట్ (ashok gehlot) మినహా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్‌ విస్తరణ (rajasthan cabinet reshuffle) నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

Rajasthan Cabinet Reshuffle ashok Gehlots Ministers Resign
Author
Jaipur, First Published Nov 20, 2021, 8:03 PM IST

రాజస్థాన్‌లో (Rajasthan) సీఎం అశోక్ గెహ్లాట్ (ashok gehlot) మినహా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్‌ విస్తరణ (rajasthan cabinet reshuffle) నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ (congress) అదిష్టానం మంత్రి వర్గ జాబితా పంపనున్నట్లు తెలుస్తోంది. 

పార్టీ అధిష్టానం గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ వర్గానికి రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం అశోక్‌ , సచిన్‌ పైలట్‌‌లు పార్టీ అధినేత్రి సోనియాను (sonia gandhi) కలిసి మాట్లాడారు. రాజస్థాన్‌ కేబినెట్‌లో ప్రస్తుతం సీఎం గెహ్లాట్‌ సహా 21 మంది మంత్రులు ఉన్నారు. శాసనసభలో ఉన్న 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో గరిష్ఠంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది.  

రాజస్థాన్‌ గవర్నర్‌ (rajasthan governor) నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ (ajay maken) , సీఎం అశోక్‌‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios