రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. సుధీర్ఘ కసరత్తు అనంతరం 13 మందిని మంత్రులను, 10 మంది సహాయ మంత్రులను తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.

బీడి కల్లా, శాంతికుమార్ ధరీవాల్, ప్రసాదీలాల్ మీనా వంటి ప్రముఖులకు కేబినెట్‌లో స్థానం లభించింది. ఈ నెల 17న గెహ్లాట్ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎం రేసులో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ పోటీ పడినప్పటికీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గెహ్లాట్ వైపే మొగ్గుచూపారు.