రాజస్థాన్‌లోని భిల్వారాలో కత్తితో బెదిరించి ఓ నవ వధువును ముగ్గురు దుండగులు అపహరించారు. వధువు ప్రేమికుడు, తన సహచరులతో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డాడని వరుడు ఆరోపించాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వధువు కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
ఇటీవల కాలం పెళ్లిళ్లల్లో ఊహించని, చెప్పారని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే.. కిడ్నాప్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లిచేసుకున్న వీడ్కోలు అనంతరం వధూవరులు దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్లగా.. ఎవరూ ఊహించని విధంగా కొందరూ దుండగులు వచ్చి.. నవ వధువు పీక మీద కత్తిపెట్టారు. అందరూ చూస్తుండగానే.. ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ మేరకు వరుడి బంధువులు దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వధువు, ఆమె ప్రేమికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజస్థాన్‌లో(Rajasthan) భిల్వారా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్ భిల్వారాలోని బిజోలియా నివాసి రవి నాయక్, లచుడా చెందిన ఓ యువతిని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. దీని తరువాత వధూవరులు వారి కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులతో కలిసి దర్శనం కోసం కృషి మండిలోని ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురు అగంతకులు స్కూటర్ తీసుకొచ్చి నవ వధువు గొంతుపై కత్తి పెట్టి.. బెదిరించారు. అందరూ చూస్తుండగానే ఆ యువతిని ఎత్తుకెళ్లారు. దీంతో వరుడు రవి, అతని కుటుంబ సభ్యులు అగంతకులను వెంబడించారు. అయితే ముగ్గురు నిందితులు మాత్రం పట్టుబడలేదు. దీని తర్వాత రవి భిల్వారాలోని సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. ఓ దుండగుడు తన సహచరులతో వచ్చి.. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లాడని వరుడు రవి ఆరోపించాడు. ఈ సమయంలో తన చేతికి కూడా దెబ్బ తగిలిందని చెప్పాడు.
అయితే.. నవ వరుడు ఫిర్యాదు ప్రకారం విచారణ చేసిన పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కిడ్నాప్ చేసింది ఎవరో కాదనీ, నవ వధువును తన ప్రియుడే కిడ్నాప్ చేశాడని, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు తెలిపారు. బిజోలియా నివాసి రవి నాయక్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జగదీష్ చంద్ర మీనా తెలిపారు. కవితకు వివాహమైందని, ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఆమె ప్రేమికుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ముగ్గురు దుండగులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.
