rajasthan assembly elections 2023 : డేరాబాబాకు మరోసారి పెరోల్..! ఎన్నికల స్టంటేనా?
డేరా బాబాకు పదేపదే ఫేరోల్ ఇవ్వడం మీద ఆయన కొడుకు అన్షుల్ చత్రపతి కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిన డేరా బాబా లాంటి నేరగాళ్లు బయటికి రావడం సిగ్గుచేటు అన్నారు.
గుజరాత్ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలవేళ డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం మీద బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని రోహ్ తక్ లో ఉన్న సునారియ జైలులో డేరా బాబా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆయన మీద హత్య, అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్లో ఎన్నికలకు ఇంక నాలుగు రోజులే ఉండగా ఈ సమయంలో డేరా బాబా పెరోల్ పై బయటికి రావడం మీద గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం డేరా బాబా స్వస్థలం రాజస్థాన్ కావడమే. డేరా బాబాగా ప్రసిద్ధి చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ స్వస్థలం రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ లోని గురుసర్ మోడియా గ్రామం.
జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డేరా బాబా ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పత్లోని బర్నావ ఆశ్రమంలో ఉంటారు. డేరా బాబాకు హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో.. రాజస్థాన్ లోని అనేక జిల్లాల్లో స్థావరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పెరోల్ మంజూరు విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్, హనుమాన్ గౌడ్, చిరు సహా పలు జిల్లాల్లో ఆయన ప్రభావం అధికంగా ఉంటుంది. పలు జిల్లాల్లోనూ ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా ఉన్నారు.
boat fire: ముంద్రా పోర్ట్ లో అగ్నిప్రమాదం.. బోటులో చెలరేగిన మంటలు..
25న రాజస్థాన్లో పోలింగ్ జరగనుంది. నాలుగు రోజులకు ముందు గుర్మీత్ రామ్ రహీమ్ ను పెరోల్ మీద మరోసారి బయటికి తీసుకురావడం అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతకుముందు 2022 ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు డేరా బాబా పెరోల్ పై బయటికి వచ్చారు. ఆ తర్వాత హర్యానాలో జరిగిన పౌర ఎన్నికల సమయంలో కూడా బయట ఉన్నారు. జైల్లో ఉన్నా కూడా ఆన్లైన్లో సత్సంగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. పలువురు సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ల అభ్యర్థులు ఆ సత్సంగ్ లో పూజలు చేయడం ఆయన బలాన్ని తెలుపుతోంది.
డేరా బాబా 2017 ఆగస్టు 25 నుంచి జైలులో ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్లకు 2020 అక్టోబర్ 24 న మొదటిసారిగా ఆయనకు 24 గంటల పెరోల్ లభించింది. ఆ మరుసటి సంవత్సరమే 2021 మే 21న మరోసారి ఆయనకు పెరోల్ వచ్చింది. గుర్మీత్ తల్లి అనారోగ్యంతో ఉండడంతో కలవడానికి ఈ పెరోల్ ఇచ్చారు. ఆ తర్వాత 2022, ఫిబ్రవరి 7వ తేదీన 21రోజుల పెరోల్ మంజూరు చేశారు. అదే సంవత్సరం జూన్ 17వ తేదీన 30 రోజుల పేరోల్ వచ్చింది. మరో మూడు నెలలకు అంటే అక్టోబర్ 15వ తేదీన 42 రోజులు పెరోల్ ఇచ్చారు. ఇక ఈ సంవత్సరానికి వస్తే జనవరిలో 40 రోజుల పెరోల్, జూలైలో 30 రోజుల పెరోల్ వచ్చింది. డేరా బాబా పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 15న కూడా ఫెరోల్ పొందాడు. సగం రోజులు జైలులో ఉంటే సగం రోజు పెరోల్ ఫై బయట ఉంటున్నాడు డేరా బాబా.
ప్రస్తుతం 37 నెలల శిక్షాకాలంలో తొమ్మిదవ సారి పెరోల్ మీద డేరా బాబా బయటికి వస్తున్నాడు. దీనిమీద హర్యానా ప్రభుత్వం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గురుమిత్ రామ్ రహీమ్ ను జైలు నుంచి పెరోల్ మీద విడుదల చేయడానికి ప్రశ్నించింది. హర్యానా కేబినెట్ మంత్రి మూల్చంద్ శర్మ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరో పెరోల్ ను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ పరిపాలన ఆధారంగానే ప్రజలలోకి వెళతామని ఎవరి దయా అవసరం లేదన్నారు. రామచంద్ర చత్రపతి అనే జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
డేరా బాబాకు పదేపదే ఫేరోల్ ఇవ్వడం మీద ఆయన కొడుకు అన్షుల్ చత్రపతి కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిన డేరా బాబా లాంటి నేరగాళ్లు బయటికి రావడం సిగ్గుచేటు అన్నారు. పదేపదే ఇలా పెరోల్ పొందడం వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తాయని, ఇది దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. నిబంధనల ప్రకారం పెరోల్ ఇస్తున్నట్లుగా ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్నప్పటికీ ఇది ప్రజాస్వామ్యానికి చెంపపెట్టు అని అన్షుల్ చత్రపతి అన్నారు. ఒకరోజు కూడా పెరోల్ రాక ఏళ్ల తరబడి కటకటాల వెనక మగ్గుతున్న ఖైదీలు ఎంతోమంది ఉన్నారని చెప్పుకొచ్చారు.