Asianet News TeluguAsianet News Telugu

కేంద్రానికి కాంగ్రెస్ సర్కారు షాక్.. అవినీతి కేసులో ఇద్దరు ఈడీ అధికారులను అరెస్టు చేసిన రాజస్తాన్ ఏసీబీ

కేంద్ర ప్రభుత్వానికి రాజస్తాన్ సర్కారు షాక్ ఇచ్చింది. ఇద్దరు ఈడీ అధికారులు రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
 

rajasthan acb team arrested two ed officials red handendly while taking rs 15 lakh bribe kms
Author
First Published Nov 2, 2023, 7:14 PM IST

జైపూర్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వరకు చాలా మంది ప్రతిపక్ష నేతలు ఈడీని దుర్వినియోగం చేస్తున్నదని కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవలే రాజస్తాన్‌లోనూ ఈడీ దర్యాప్తు జరిగింది. రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్‌ను ఈడీ ఫారీన్ ఎక్స్‌జేంజ్ రూల్స అతిక్రమణ ఆరోపణల కింద సుమారు 9 గంటలపాటు ప్రశ్నలు కురిపించింది. ఎన్నికల ముంగిట ఈ ఈడీ ప్రవేశాన్ని రాజకీయ కుట్రగా సీఎం గెహ్లాట్ ఆరోపించారు. దీంతో యథావిధిగా విపక్షాలు ఈడీని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం విమర్శలు సంధించాయి. ఈడీ కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అయిపోయిందని ఆరోపణలు చేశాయి. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ సర్కారు ఈడీ దాడులను, దర్యాప్తు కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా మార్చేసింది.

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్‌ను అక్టోబర్ 30వ తేదీన ఈడీ దర్యాప్తు చేసింది. కాగా, తాజాగా, ఈడీ అధికారులను అవినీతి కేసులో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అరెస్టు చేసింది.

రాజస్తాన్‌లో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ చిట్ ఫండ్ కేసు దర్యాప్తును నిలిపేయాలంటే లంచం కావాలని ఇద్దరు ఈడీ అధికారులు డిమాండ్ చేసినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఆ దర్యాప్తు ఆపేయడానికి రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఈడీ అధికారులను అరెస్టు చేసినట్టు రాజస్తాన్ ఏసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: చంద్రుడు వెళ్లిపోయేలా ఉన్నాడు.. సహాయం కోసం పోలీసులకు ఢిల్లీ వాసి ఫోన్.. రంగంలోకి అధికారులు

‘ఇద్దరు ఈడీ ఇన్‌స్పెక్టర్లు రూ. 15 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం పట్టుకుంది. ఈడీ ఇన్‌స్పెక్టర్లు ప్రెమిసెస్‌లనూ తనిఖీలు చేస్తున్ాం’ అని కాంగ్రెస్ పాలిత రాజస్తాన్ ఏసీబీ పేర్కొంది.

దీంతో సోషల్ మీడియాలో ఏసీబీ వర్సెస్ ఈడీ అని, కేంద్రంలోని బీజేపీ వర్సెస్ రాజస్తాన్‌లోని కాంగ్రెస్ అంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios