కేవలం 48గంటల్లో 10మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్  రాష్ట్రం కోటాలోని ఆస్పత్రిలో చోటుచేసుకుంది. డిసెంారబర్ 23, 24 తేదీల్లో ఈ దారుణం చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కోటాలోని నారాయణపుర ప్రాంతంలోని జేకే లోన్ అనే ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. చనిపోయిన 10మంది చిన్నారుల్లో నలుగురు అప్పుడే పుట్టిన చిన్నారులు కావడం గమనార్హం. కాగా... ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం ముగ్గురు సభ్యులతో కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ హెచ్ ఎల్ మీనా తెలిపారు.

మొత్తం పది మంది శిశువులు ప్రాణాలు కోల్పోగా...వారిలో నలుగురు రోజులు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు సంవత్సరన్నర వయసుగల వారు ఉన్నారు. మరొకరు ఐదు నెలలు,ఇంకొకరు 9నెలలు, మరో చిన్నారి సంవత్సరం వయసుగల వారు కావడం గమనార్హం.

వారంతా అనారోగ్యంతో బాధపడుతుండగా... చిన్నారుల కేర్ యూనిట్ లో ఉంచారు. డిసెంబర్ 23 వ తేదీన ఆరుగురు  చనిపోగా... తరువాతి రోజు మరో నలుగురు మృత్యువాతపడ్డారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే  చిన్నారులు ప్రాణాలు కోల్పోయారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. కారకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 48గంటల్లో ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు.