ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు.. విషయం తెలిసినా తల్లి పట్టించుకోలేదు. ఫలితంగా మూడు దశాబ్దాలుగా కన్న కూతురు.. తండ్రి బారిన పడి నరకం అనుభవించింది. చివరికి పెళ్లై వెళ్లిపోయాక.. తన చెల్లిలితోనూ అలాగే వ్యవహరిస్తుండడంతో..
జైపూర్ : తన కూతుర్ల పట్ల ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వావివరుసలు మరచి ఇద్దరు daughterళ్లను లైంగికంగా వేధించాడు. ఏకంగా మూడు దశాబ్దాల నుండి అతను తన కూతురిని వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన rajastanలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారి జుల్ఫికర్ వివరాలు తెలుపుతూ… జోధ్ పూర్ లోని chopasni హౌసింగ్ బోర్డు పరిధిలో కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు.
పెద్ద కూతురు ఆరు సంవత్సరాల వయసు నుంచే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. 1993లో తనపై అత్యాచారం చేశాడని.. ఈ విషయం తన తల్లికి చెప్పిన పట్టించుకోలేదన్నారు. కాగా బాధితురాలి 2017 లో వివాహం అయింది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు కన్ను ఆమె చెల్లెలిపై పడింది. తాజాగా ఆమెను కూడా తండ్రి లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. దీంతో తన సోదరిని రక్షించాలని బాధితురాలు (అక్క) పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద తండ్రిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కన్న కూతుర్లపై కామంతో దాడిచేస్తున్న కేసులు రోజురోజుకూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. వావి వరసలు మరిచి కన్నకూతుర్లనే బలి తీసుకుంటున్న కామాంధులు పేట్రేగి పోతున్నారు. కూతురి మీద లైంగిక దాడి చేయద్దన్నందుకు కట్టుకున్న భార్యను బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన తమిళనాడులో నిరుడు మేలో చోటు చేసుకుంది.
కన్న కూతురిమీద లైంగిక దాడికి పాల్పడొద్దని హెచ్చరించిన భార్యను హతమార్చిన మానవ మృగం మురుగేషన్ (54)కు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే... పుదుకోట్టై సమీపంలోని తేనిపట్టు కి చెందిన రైతు మురుగేషన్ కు ముగ్గురు భార్యలు, 11 మంది పిల్లలు ఉన్నారు. అయినా అతని కామవాంఛ తీరలేదు.
రెండో భార్య భానుమతి 17 యేళ్ల కుమార్తె మీద అతని కన్ను పడింది. ఆమె మీద మురుగేశన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన భార్య అడ్డు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన మురుగేషన్ భార్య తల మీద బండ రాయితో కొట్టి హత్య చేశాడు. కేసును విచారించిన కోర్టు నిందితుడికి ఉరిశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.
కాగా, మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పదికొండేళ్ల బాలిక మీద auto driver వెంకటయ్య molestationకి పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలిక మీద ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే.. మార్చి 31న బాధిత బాలిక తన స్నేహితురాలితో కలిసి school నుంచి ఇంటికి వెడుతోంది. ఈ క్రమంలో బాలికకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ ఆమెను మాత్రమే తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు.
ఏప్రిల్ 1న ఈ విషయాన్ని బాలిక స్నేహితురాలు స్కూల్ టీచర్ కు చెప్పడంతో ఆమె బాలికను పిలిపించి విషయం తెలుసుకుంది. ఆటో డ్రైవర్ వెంకటయ్య తన మీద అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులకు స్కూల్ టీచర్ ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది. అయితే పరువు పోతుందని.. ఇతర కారణాలతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో స్కూలు టీచర్ బాలిక తల్లిదండ్రులతో మళ్లీ మాట్లాడారు ఆ తరువాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిమీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
