Asianet News TeluguAsianet News Telugu

అదృశ్యమైన మహిళా క్రికెటర్.. అనుమాన‌స్ప‌ద రీతిలో.. చెట్టుకు వేలాడుతూ మృతదేహం

ఒడిశాకు చెందిన‌ రాజ‌శ్రీ స్వెయిన్ అనే మ‌హిళా క్రికెట‌ర్ అనుమాన‌స్ప‌ద రీతిలో మ‌ర‌ణించింది. అదృశ్య‌మైన మ‌రుస‌టి రోజే ఆమె మృత్యువాత‌ప‌డింది. క‌టక్ సిటీ స‌మీపంలోని ద‌ట్ట‌మైన అడ‌విలో శుక్ర‌వారం క్రికెట‌ర్ మృత‌దేహాన్ని పోలీసులు క‌నుగొన్నారు. 

Rajashree Swain a 26-year-old woman cricketer of Odisha, was found hanging
Author
First Published Jan 14, 2023, 1:04 AM IST

ఒడిశాలో మహిళా క్రికెట్ మరణం సంచలనం సృష్టించింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ మృతదేహం అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అస‌హ‌జ‌మైన మ‌ర‌ణంగా గురుడిఘాటియా పోలీసులు కేసు న‌మోదు చేశారని క‌ట‌క్ డిఎస్పీ పినాక్ మిశ్రా తెలిపాడు. ఆమె మ‌ర‌ణానికి కార‌ణం ఏంట‌నేది తెలుసుకునేందుకు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు కోచ్‌పై ఆరోపణలు చేశారు.గత మూడు రోజుల క్రితం 22 ఏళ్ల రాజశ్రీ  అదృశ్యమైంది. హఠాత్తుగా ఆమె మృతదేహం శుక్రవారం నాడు గుర్డిఝాటియా అడవిలో లభ్యమైంది. దీంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు పెట్టారు.

మరోవైపు.. కోచ్‌తో పాటు రాజశ్రీ కుటుంబం కూడా ఒడిశా క్రికెట్ అసోసియేషన్‌పై ఆరోపణలు చేసింది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా.. అడవిలో రాజశ్రీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తేలింది. గత మొబైల్ నెట్‌వర్క్ లొకేషన్‌తో పోలీసులు అడవికి చేరుకున్నారు.

రాజశ్రీకి సంబంధించి ఒడిశా క్రికెట్ అసోసియేషన్ పోలీసులకు మిస్సింగ్ కేసు పెట్టింది. స్థానిక మీడియా ప్రకారం.. ఆమె క్రికెట్ శిక్షణా శిబిరానికి కూడా హాజరయ్యింది. ఇందులో మొత్తం 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్స్‌కు రాకపోవడంతో ఒత్తిడిలో ఉన్న ఆమె జనవరి 11 తర్వాత కనిపించకుండా పోయింది.

తన కుమార్తె ఎంపిక శిబిరం కోసం కటక్‌కు వెళ్లినట్లు రాజశ్రీ తల్లి ఒక న్యూస్ ఛానెల్‌తో సంభాషణ సందర్భంగా చెప్పారు. అక్కడ ఓ హోటల్‌లో బస చేసింది. శిబిరంలో 10 రోజుల తర్వాత రాజశ్రీని ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. శిబిరంలో ఆమె అత్యుత్తమ క్రీడాకారిణి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కూతురు ఫైనల్‌కు ఎంపిక కాకపోవడంతో ఒత్తిడికి లోనైంది. ఈ విషయమై రాజశ్రీ తన సోదరికి కూడా ఫోన్ చేసిందని తెలిపారు. 

ఈ ఘటనపై కటక్ డీసీపీ పినాక్ మిశ్రా మాట్లాడుతూ.. రాజశ్రీ స్వైనీ అదృశ్యంపై మంగళబాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో శుక్రవారం నాడు రాజశ్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు, దీనిని పంచనామా కోసం SCB మెడికల్‌కు పంపారు. అదే సమయంలో అటవీ ప్రాంతంలో రాజశ్రీ వాహనం గురించి తెలియడంతో పోలీసులు పేర్కొన్న స్థలంలో వెతకడం ప్రారంభించారు.

అయితే.. బజ్రకాబాటిలోని మహావీర్ గెలాక్సీ హోటల్ నుంచి రాజశ్రీ అదృశ్యం కావడంతో కమిషనరేట్ పోలీసు బృందం అక్కడికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. కోచ్‌తో పాటు కొందరు ఆటగాళ్లను కూడా విచారించారు. అక్కడి నుంచి ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన వారు లేదా ఎవరిపై ఆరోపణలు వచ్చినా అందరినీ విచారణ పరిధిలోకి తీసుకొచ్చి నిశితంగా పరిశీలిస్తారు.

సూసైడ్ నోట్‌

మరోవైపు.. మహిళా క్రీడాకారిణి రాజశ్రీ స్వాని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. బాధితురాలి సహా క్రీడాకారులు, మౌనం వహించారు. రాజశ్రీ నుంచి సూసైడ్ నోట్ లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆమె బాగా ఆడుతుందని, అయినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా పదే పదే మానసికంగా హింసించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. రాజశ్రీ సూసైడ్ నోట్ తెరపైకి వచ్చిన తరువాత.. తాజాగా కోచ్ , OCA నిర్వహణ ఆరోపణలు తీవ్రమైవుతున్నాయి. అదే సమయంలో హోటల్‌లోని రూం నంబర్ 211కి పోలీసులు సీల్ వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios