సూపర్ స్టార్ రిజనీకాంత్.. కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు పడిచచ్చిపోయే వారు ఉన్నారు.  కాగా.. 
ఎన్నాళ్ల‌నుండో అభిమానులు ర‌జ‌నీకాంత్ రాజకీయ ఆరంగేట్రం గురించి క‌ళ్ళల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. దీనికి రీసెంట్‌గా తెర‌దించారు త‌లైవా. 

డిసెంబ‌ర్ 31న పార్టీ ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా చెప్పిన ర‌జ‌నీ జ‌న‌వ‌రిలో పార్టీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని అన్నారు. సూప‌ర్ స్టార్ ప్ర‌క‌ట‌న‌తో త‌మిళ‌నాడులో వేడి మొద‌లైంది. కొంద‌రు ఆయ‌నకు స్వాగతం ప‌లుకుతుండ‌గా, మ‌రి కొంద‌రు విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇన్నాళ్లు సినిమాల‌తో అల‌రించి అశేష జ‌నాద‌ర‌ణ పొందిన రజ‌నీకాంత్ ఇక ఇప్ప‌టి నుండి  ఆధ్యాత్మిక రాజకీయం చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

 అయితే రాజ‌కీయాల‌లోకి వెళుతున్న సంద‌ర్భంగా త‌లైవా బెంగ‌ళూరులో ఉన్న త‌న సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ ఆశీస్సులు అందుకున్నారు. సత్యనారాయ‌ణ..ర‌జ‌నీకి శాలువా క‌ప్పి బెస్ట్ విషెస్ అందించారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.