Asianet News TeluguAsianet News Telugu

Raj Kundra Pornography Case : సిగ్గుతో ముఖం దాచుకుని కూర్చోను.. మౌనం వీడిన రాజ్ కుంద్రా..

నేను నా జీవితంలో ఎప్పుడూ పోర్నోగ్రఫీ తీయడం గానీ, అమ్మడం గానీ చేయలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మంత్రగాడి వేట తప్ప మరొకటి కాదు. కొన్నికారణాల వల్ల పూర్తి విషయాలు బయటకు చెప్పలేను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను.

Raj Kundra calls pornography case witch hunt, finally break silence
Author
Hyderabad, First Published Dec 21, 2021, 11:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ అందాల తార shilpa shetty భర్త రాజ్ కుంద్రా pornography caseలో అరెస్టై... అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈ ఇష్యూ గురించి మాట్లాడకుండా.. మీడియా కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు Raj Kundra. తాజాగా దీనిపై స్పందిస్తూ  ఓ స్టేట్ మెంట్ విడుదల చేశాడు ఈ బిజినెస్ మ్యాన్.

ఆ స్టేట్ మెంట్ లో.. ఈ విషయంపై నేను సైలెంట్ గా ఉండడం వల్ల తప్పుదారి పట్టించే విధంగా చాలా బాధ్యతారహితమైన ప్రకటనలు, కథనాలు వెలువడుతున్నాయి. నా మౌనాన్ని తప్పు చేసినదానికి అంగీకారం గా భావిస్తున్నారు. అందుకే ఎంతో ఆలోచించి ఇది చెబుతున్నా..

నేను నా జీవితంలో ఎప్పుడూ పోర్నోగ్రఫీ తీయడం గానీ, అమ్మడం గానీ చేయలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మంత్రగాడి వేట తప్ప మరొకటి కాదు. కొన్నికారణాల వల్ల పూర్తి విషయాలు బయటకు చెప్పలేను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను.

ట్రోలింగ్, ప్రతికూలత, విషపూరితమైన ప్రజల అవగాహన మా కుటుంబాన్ని నన్ను చాలా బలహీనపరిచింది.  దీన్ని సరిగ్గా  సెట్ చేయడానికి నేను సిగ్గుతో నా ముఖాన్ని దాచుకోను. కానీ ఇలా నిరంతరమైన మీడియా ట్రయల్ తో నా గోప్యతకు భంగం కలగకూడదని కోరుకుంటున్నాను. నా ప్రాధాన్యత ఎల్లప్పుడు నా కుటుంబమే.

మరే దాని గురించి నాకు అవసరం లేదని చెప్పాడు కుంద్రా. గౌరవంగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అని నమ్ముతున్నట్టు అదే అతను అందరి నుంచి అభ్యర్థిస్తున్నట్లు కుంద్రా తెలిపాడు. 

ఇదిలా ఉండగా, నవంబర్ 14న రాజ్ కుంద్రా దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఓ బిజినెస్ డీల్ విషయంలో తనను మోసం చేసినట్లు బిజినెస్ మాన్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల క్రితం ఫిట్నెస్ ఎంట్రప్రైజ్ స్థాపించనున్నట్లు నమ్మబలికిన రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి పెట్టుబడి రూపంలో రూ. 1.5కోట్లు తీసుకున్నారు. వ్యాపార భాగస్వామిగా లాభాలు వస్తాయి, అని నమ్మబలికారు. కాలం గడుస్తున్నా ఆ ఫిట్నెస్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

Pornography case: సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసిన రాజ్ కుంద్రా

దీనితో సదరు వ్యాపారి తన డబ్బులు కోటిన్నర తిరిగి చెల్లించాలని శిల్పా దంపతులను అడగడం జరిగింది. డబ్బులు తిరిగి చెల్లించకపోగా... తనను బెదిరించారని బిజినెస్ మాన్ తన కంప్లైంట్ లో పొందుపరిచారు. ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్ లో రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 420 చీటింగ్ తో పాటు పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు అయినట్లు సమాచారం. 

ఇక నీలి చిత్రాల చిత్రీకరణ, యాప్స్ ద్వారా ప్రసారం చేస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రా జులై నెలలో అరెస్ట్ అయ్యాడు. దాదాపు రెండు నెలల జైలు జీవితం అనంతరం సెప్టెంబర్ లో విడుదల కావడం జరిగింది. భర్త అరెస్ట్ తరువాత కొన్నాళ్ళు శిల్పా శెట్టి (Shilpa shetty) మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. టీవీ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొట్టిన శిల్పా , తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే చాలా మంది బాలీవుడ్ సెలెబ్స్ ఆమెకు మద్దతుగా నిలిచారు. 
..
విడుదల తరువాత రాజ్ కుంద్రా మొదటిసారి భార్య పిల్లలతో హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయం సందర్శన సమయంలో కనిపించారు. ట్రిప్ అనంతరం శిల్పా శెట్టి మాత్రమే ఒంటరిగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కాగా, రాజ్ కుంద్రా, పిల్లలు కనిపించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios