Asianet News TeluguAsianet News Telugu

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు: రేపటి వరకు వానలు

మహారాష్ట్రలోని ముంబైని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశం సందర్భంగా  భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాల రాకకు ముందు టౌటే తుఫాన్ ప్రభావంతో ముంబైలో వర్షాలు కురిశాయి. 

Rain lashes various parts of Mumbai, Thane lns
Author
Mumbai, First Published Jun 16, 2021, 11:01 AM IST

ముంబై: మహారాష్ట్రలోని ముంబైని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశం సందర్భంగా  భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాల రాకకు ముందు టౌటే తుఫాన్ ప్రభావంతో ముంబైలో వర్షాలు కురిశాయి. 

మంగళవారం రాత్రి నుండి ముంబై, థానే సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ఈ నెల 17న ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ముంబైకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  భారీ వర్షాల కారణంగా ముంబైలోని నివాగ ప్రాంగంణంలో పార్క్ చేసిన కారు భూమిలో కుంగిపోయింది. 

 

ముంబైతో పాటు ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, అసోం, మేఘాలయా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లో కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు.ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే పై వర్షం నీటితో నిండిపోయింది. భారీ వర్షం కారణంగా వర్షం నీటిలోనే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios