Railways: ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేదంటే.. భారీ మొత్తంలో భారతీయ రైల్వే శాఖ విధించనున్నది. రైళ్లలో లగేజీని తీసుకెళ్లడానికి తాజాగా నిబంధనలను రూపొందించింది.
Railways: మీరు రైల్వేలో ఎక్కువగా ప్రయాణిస్తారా..? మీతో పాటు ఎక్కువ లగేజీ తీసుకెళ్తుంటారా? అయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ఈ నిబంధనను పాటించాల్సిందే.. లేదంటే.. మీ ప్రయాణం మీజేబుకు భారంగా మారవచ్చు. తాజా నిబంధనల ప్రకారం.. ‘ఫ్రీ అలవెన్స్’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని రైల్వేశాఖ పేర్కొంది. టికెట్ తీసుకోకుండా.. అదనం లగేజీతో అక్రమంగా ప్రయాణించే... భారీ జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. అదనపు లగేజీ తీసుకెళ్తూ పట్టుబడితే.. సాధారణ లగేజీ రేటు కంటే.. ఆరు రెట్లు ఎక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. లగేజీకి కనీస ఛార్జీ రూ.30. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీతో పాటు ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చో తెలుసుకుందాం..
IRCTC ప్రకారం.. AC ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులు 70 కిలోల వరకు, AC టూ-టైర్ లో 50 కిలోల వరకు, AC 3-టైర్ స్లీపర్, AC చైర్ కార్, స్లీపర్ క్లాస్‌లలో 40 కిలోల వరకు ఉచిత లగేజీ తీసుకెళ్లవచ్చని నిర్ణయించింది. అలాగే.. రెండవ తరగతిలో ప్రయాణించే వారు తమతో 25 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
మరీ అదనపు లగేజీ ఉంటే ఏమి చేయాలి?
రైలులో ప్రయాణించేటప్పడు.. అదనపు లగేజీ తీసుకెళ్లాలనుకుంటే... ప్రయాణానికి 30 నిమిషాల ముందు లగేజీ కార్యాలయానికి వెళ్లి బుక్ చేసుకోవాలి. లేదా టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో కూడా లగేజీని అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అదే సమయంలో లగేజీని సక్రమంగా ప్యాకేజ్ చేయని వాటిని బుక్ చేయబోమని IRCTC స్పష్టం చేసింది. నూతన నిబంధనల అమలు తరువాత.. ప్రయాణికులందరూ తక్కువ లగేజీలను తమ వెంట తీసుకెళ్లాలని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉచిత పరిమితిని మించి.. అధిక లగేజీతో ప్రయాణించే వారికి భారీమొత్తంలో జరిమానా విధిస్తారు ఆ విషయం గుర్తుంచుకోండి.
టికెట్ లేకపోతే జరిమానా ఎంత?
టికెట్ లేకుండా అదనపు లగేజీతో ప్రయాణిస్తే.. లగేజీ రుసుము కంటే ఆరు రెట్లు జరినామా విధిస్తారు. ఉదాహరణకు 40 కిలోల అదనపు లగేజీతో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాడనుకుంటే.. రూ. 109ల లగేజీ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా.. పట్టుబడితే.. రూ. 654ల జరిమానా విధించారు.
అదనం లగేజీ తో ప్రయాణిస్తే.. సగం ఆనందమే ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్‌లో పేర్కొంది. రైలులో అధిక లగేజీతో ప్రయాణించవద్దు, అలా అయితే, లగేజీ వ్యాన్‌లో బుక్ చేసుకోండి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, రైలులో ఉచిత పరిమితికి మించి లగేజీతో ప్రయాణించే ప్రయాణికులకు జరిమానా విధించబడుతుందని పేర్కొంది.
