Asianet News TeluguAsianet News Telugu

రైలుకు ఎదురెళ్లి బాలుడిని కాపాడిన సాహసికి.. బహుమతుల వెల్లువ..

సుశిక్షితులైన సైనికులు చేయగలిగిన సాహసం చేసి ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగికి రైల్వేమంత్రిత్వ శాఖ బహుమతి ప్రకటించింది. నిండు ప్రాణాన్ని కాపాడినందుకు ప్రశంసించింది. మరోవైపు ఆయనకు క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా కూడా మరొక బహుమతిని ప్రకటించారు. ఆ ఉద్యోగి హీరోయిజం ప్రదర్శించారని అభినందించారు.

Railways employee saves child from approaching train, receives praise from Piyush Goyal - bsb
Author
Hyderabad, First Published Apr 21, 2021, 1:15 PM IST

సుశిక్షితులైన సైనికులు చేయగలిగిన సాహసం చేసి ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగికి రైల్వేమంత్రిత్వ శాఖ బహుమతి ప్రకటించింది. నిండు ప్రాణాన్ని కాపాడినందుకు ప్రశంసించింది. మరోవైపు ఆయనకు క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా కూడా మరొక బహుమతిని ప్రకటించారు. ఆ ఉద్యోగి హీరోయిజం ప్రదర్శించారని అభినందించారు.

సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్న దాని ప్రకారం, థానేలోని వాంగని రైల్వే స్టేషన్ లో ఓ మహిళ ఏప్రిల్ 17న ఓ బాలుడిని ఎత్తుకుని రైలు పట్టాలపై నడుస్తోంది. వేగంగా ఓ రైలు దూసుకువస్తోంది. అదే సమయంలో ఆమె చేతిలోని బాలుడు జారిపోయి రైలు పట్టాలపై పడిపోయాడు.

అక్కడే పాయింట్స్ మన్ గా పనిచేస్తున్న మయూర్ షెల్కే అది గమనించాడు. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాలనుకున్నాడు. దానికోసం తన ప్రాణాలు అపాయంలో పడే ప్రమాదం ఉన్నా లెక్క చేయలేదు. 

బాలుడు పట్టాలపై పడిపోయి.. ప్లాట్ ఫాం ఎత్తుగా ఉండడం వల్ల ఎక్కలేకపోవడాన్ని గమినంచాడు. అంతలో ఆటువైపు నుంచి ట్రైన్ రావడం కూడా గమనించాడు. వెంటనే అతి వేగంగా పరిగెత్తుకెళ్లి బాలుడిని ఫ్లాట్ ఫాం మీదికి వేసి.. తానూ ఒక్క గెంతులో ప్లాట్ ఫాం మీదికి ఎగిరాడు.

అతను ప్లాట్ ఫాం మీదికి ఎక్కడం.. ట్రైన్ రావడం రెప్పపాటు తేడాలో జరిగిపోయింది. ఇది చూసిన అందరూ అతని సాహసానికి మెచ్చుకున్నారు. చిన్నపాటి ఆలోచనతో ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని కాపాడిన మయూర్ షెల్కేకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.

సమయోచితంగా వ్యవహరించి, చిన్నారిని కాపాడినందుకు సెంట్రల్ రైల్వే ఉద్యోగి అయిన మయూర్ షెల్కేను రైల్వే మంత్రిత్వ శాఖ అభినందించింది. ఆయనకు రూ.50వేలు బహుమతి ప్రకటించింది. 

ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి, బాలుడిని కాపాడారని ప్రశంసించింది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మయూర్ షెల్కే సాహసోపేతర చర్యను ట్విటర్ ద్వారా ప్రశంసించారు. యావత్తు రైల్వే మంత్రిత్వ శాఖ ఆయనను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు. 

ఇక క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా మాట్లాడుతూ, మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమని చెప్పారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందన్నారు. ఆయనకు జావా మోటార్ సైకిల్ ను బహుమతిగా ఇస్తామని చెప్పారు. ఆయనలో ఓ లెజెండ్ కు ఉండే సత్తా ఉందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios