Asianet News TeluguAsianet News Telugu

రైల్లో ఒంటరి 15యేళ్ల బాలిక.. కదిలిస్తే షాకింగ్ నిజాలు.. కంటతడి పెట్టిన పోలీసులు.. !

‘నాపై తండ్రి చేస్తున్న అత్యాచారాల గురించి మా అమ్మకు తెలుసు. అయినా పట్టించుకోలేదు. తండ్రి ఫిక్స్ చేసిన పెళ్లికి ఆమె కూడ వత్తాసు పలుకుతోంది. అందుకే నెల క్రితం ఇంటినుంచి తప్పించుకుని బెంగళూరు వచ్చాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. 

Railway team rescues 15-year-old girl from alleged trafficking near Bengaluru - bsb
Author
Hyderabad, First Published Jul 12, 2021, 5:02 PM IST

బెంగళూరులోని సంఘమిత్ర స్పెషల్ ఎక్స్ ప్రెస్ లో తమ రెగ్యులర్ విధుల్లో భాగంగా రైల్లో చెకింగ్ చేస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బందికి ఒంటరిగా ఓ 15 యేళ్ల బలిక కనిపించింది. ఆమె భయంభయంగా చూస్తోంది. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా పోలీసులకు అనిపించింది. వెంటనే పోలీసులు ఆరా తీశారు.

ఆ చిన్నారి చెప్పిన విషయాలు విని వారి కళ్లు చెమర్చాయి. బెంగళూరుకు సమీపంలోని బంగారపేట్ జంక్షన్ లో శనివారం ఈ ఘటన జరిగింది. రైల్లో ఒంటరిగా కనిపించి తమను సహాయం అడిగిన బాలికను రక్షించిన పోలీసులు ఆమెను విచారించారు. 

తనది బీహార్లోని తూర్పు చంపారన్ లోని మోతిమరి ప్రాంతమని, తండ్రి తనమీద పలుసార్లు అత్యాచారానికి పాల్పడడంతోపాటు తనకు నచ్చని వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశాడని తెలిపింది. 

‘నాపై తండ్రి చేస్తున్న అత్యాచారాల గురించి మా అమ్మకు తెలుసు. అయినా పట్టించుకోలేదు. తండ్రి ఫిక్స్ చేసిన పెళ్లికి ఆమె కూడ వత్తాసు పలుకుతోంది. అందుకే నెల క్రితం ఇంటినుంచి తప్పించుకుని బెంగళూరు వచ్చాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. 

ఒంటరిగా ఉన్న నేను అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాకు చిక్కాను. వారు నన్ను వారం పాటు ఓ చీకటి గదిలో బంధించారు. నాకు మద్యం, మత్తు పదార్థాలు ఇచ్చారు. ఈ రోజు వేరే ప్రాంతానికి రైలులో తరలిస్తుండగా తప్పించుకున్నానని చెప్పింది. 

ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి కొన్ని పరీక్షలు చేయించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ హోమ్ కు తరలించారు. ఆ బాలిక తల్లిదండ్రులమీద పోస్కో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు. అలాగే సదరు ముఠా గురించి తీవ్రంగా గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios