మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మందికిపైగా తీవ్ర గాయాలు కాగా.. ఎనిమిది మంది పరిస్ధితి విషమంగా వున్నట్లుగా సమాచారం. 

మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మందికిపైగా తీవ్ర గాయాలు కాగా.. ఎనిమిది మంది పరిస్ధితి విషమంగా వున్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో బ్రిడ్జిపై 60 మంది రాకపోకలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైల్వే స్టేషన్‌లోని 1వ నెంబర్ ఫ్లాట్‌ఫాం నుంచి 4వ నెంబర్ ఫ్లాట్‌ఫాంకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక , పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.