న్యూఢిల్లీ: భార్యకు కరోనా సోకడంతో ఓ రైల్వే ఉద్యోగిని ఆమె తలను నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్య  చేసుకొన్నాడు.  అతుల్ లాల్ అనే వ్యక్తి రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్నాచక్ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం లాల్ భార్యకు కరోనా సోకింది. 

ఆసుపత్రిలో పరీక్షల్లో కరోనా అని తెలిసిన తర్వాత  భార్యను కత్తితో మెడ నరికి చంపేశాడు. ఆ తర్వాత  అపార్ట్‌మెంట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. కరోనా సోకిందని  ఆత్మహత్య చేసుకోవడం, హత్య చేయడం లాంటి ఘటనలు చోటు  చేసుకొంటున్నాయి.  కరోనా  వస్తే  చికిత్స చేసుకోవాలని  వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.భార్యను హత్య చేయడానికి  గల కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.