బీజేపీ ఎమ్మెల్యే, అతడి కుమారుడు మహిళను వేధించిన వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిపోయారంటూ మీడియాలో వస్తున్న‌ వరుస కథనాలపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక స్పందించారు.

ఆదివారం ట్విటర్‌ వేదికగా యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. యూపీ ప్రభుత్వం నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బేటీ బచావో మిషన్‌ మహిళలను కాపాడేందుకా? లేక నేరస్తులను కాపాడేందుకా? అని ప్రశ్నించారు. బేటీ బచావో నినాదాన్ని యూపీ ప్రభుత్వం అపరాధీ బచావోగా మార్చిందని ఎద్దేవా చేశారు.

కాగా ఇటీవల హత్రాస్‌లో అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే