ఎట్టకేలకు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. అవి ఫ్రాన్స్ లో ప్రయాణం మొదలుపెట్టినప్పటినుండి భారతీయులంతా ఆ విమానాలుయ ఎప్పుడు అంబాలలో దిగుతాయా అని ఎదురు చూసారు. ఆ విమానాల రాకతో అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వాయుసేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ప్రతిపక్ష నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం వాయుసేనకు శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రభుత్వానికి మూడు సూటి ప్రశ్నలు సంధించారు. 1. ఒక్కో విమానాన్ని 526 కోట్లకు బదులు 1670 కోట్లు వెచ్చించి ఎందుకు కొనుగోలు చేసారు?. 2. 126 విమానాలకు బదులు కేవలం 36 విమానాలను మాత్రమే ఎందుకు కొన్నారు.? 3. హాల్(హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) కి బదులు దివాళా తీసిన అనిల్ అంబానీకి ఎందుకు 30 వేల కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు? ఈ మూడు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అంటూ సవాల్ విసిరారు. 

గత సంవత్సరం నుంచే కాంగ్రెస్ వారు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే బుధవారం నాడు ప్రధాని న్నరేంద్ర మోడీ దేశ రక్షణ కన్నా సర్వోత్క్రుష్టమైనది ఇంకోటి లేదని సంస్కృతంలో ట్వీట్ చేసారు. 

ఇక రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ లో దిగగానే... వీటి చేరికతో భారత రక్షణ  నూతన అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. గత ప్రభుత్వం  ఒప్పందం ముందుకు సాగకుండా మధ్యలోనే  నరేంద్రమోడీ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని పూర్తిచేశారని అన్నారు. ఈ ఒప్పందం పై వచ్చిన అనేక ఆరోపణలు, వివాదాస్పదమైన అంశాల గురించి ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.