కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఈరోజు లోక్ సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. 12 తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసే అంశాన్ని రాహుల్ ఈ లేఖలో ప్రస్తావించారు.  

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఈరోజు లోక్ సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. గత వారం పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ 22లోగా రాహుల్ గాంధీ ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం కోరింది. ఈ క్రమంలోనే స్పందించిన రాహుల్ గాంధీ లోక్ సభ సెక్రటేరియట్ ఎంఎస్ బ్రాంచ్ డిప్యూటీ సెక్రటరీకి డాక్టర్ మోహిత్ రాజన్‌కు లేఖ రాశారు. 

12 తుగ్లక్ లేన్‌లో తన వసతి రద్దు చేస్తున్నట్టుగా ఈ నెల 27న తనకు లేఖ అందిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘గత 4 పర్యాయాలు తాను లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాను.ఇందుకు ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఇక్కడ నాకు ఎంతో సంతోషకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నా హక్కులకు భంగం కలగకుండా మీ లేఖలో ఉన్న వివరాలకు కట్టుబడి ఉంటాను’’ అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఇక, 2005 నుంచి ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాలో రాహుల్ గాంధీ నివిస్తున్నారు. ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయితే ఇటీవల ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. లోక్‌సభ సెక్రటేరియట్ లేఖ రాసిన తర్వాత.. రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ విషయంలో లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.