Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి రాహుల్ స్పెషల్ బర్త్ డే విషెస్

మోదీకి ఆయా రాష్ట్రాల సీఎంలు, నాయ‌కులు, సినీ, క్రీడా ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మోదీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు దేశ వ్యాప్తంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. 70 కేజీల ల‌డ్డూను కూడా తయారు చేయించిన‌ట్లు బీజేపీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. 
 

Rahul Gandhi Wishes PM Modi On 70th Birthday
Author
Hyderabad, First Published Sep 17, 2020, 10:42 AM IST

ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు 70వ పుట్టిన రోజు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ విదేశాల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  కాగా.. ప్రతిపక్ష పార్టీ నేత అయిన రాహుల్ గాంధీ కూడా మోదీకి విషెస్ తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మోదీజీ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా... 70వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్న మోదీకి ఆయా రాష్ట్రాల సీఎంలు, నాయ‌కులు, సినీ, క్రీడా ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మోదీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు దేశ వ్యాప్తంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. 70 కేజీల ల‌డ్డూను కూడా తయారు చేయించిన‌ట్లు బీజేపీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. 

 

ఇదిలా ఉండగా.. ఇటీవల రాహుల్ గాంధీ .. వలస  కార్మికుల విషయంలో ప్రధాని మోదీ పై విమర్శలు చేశారు. వలస కార్మికుల మరణాలకు సంబంధించిన సమాచారమేదీ తమ వద్ద లేదంటూ పార్లమెంటులో కేంద్రం సోమవారం నాడు ప్రకటించడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

‘లాక్ డౌన్‌లో ఎంత మంది వలస కార్మికులు చనిపోయారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారో మోదీ ప్రభుత్వానికి తెలీదు. మీరు లెక్కపెట్టకపోతే.. ఎవరూ చనిపోనట్టా? విచారకరమైన విషయం ఏంటంటే.. ప్రాణాలు పోతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రపంచం మొత్తం చూసినా సరే.. మోదీ ప్రభుత్వానికి మాత్రం తెలీలేదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios