Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ మేడిన్ ఇటలీ: గుజరాత్ డిప్యూటీ సీఎం ధ్వజం

 కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మేడిన్ ఇటలీ అంటూ వ్యాఖ్యానించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ విగ్రహం గురించి రాహుల్ గాంధీ చేసిన మేడిన్ చైనా వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్‌ను మేడిన్ ఇటలీ ఎద్దేవా చేశారు. 

Rahul Gandhi was made in Italy: Gujarat D.CM Nitin patel
Author
Gandhinagar, First Published Sep 28, 2018, 4:24 PM IST

గాంధీనగర్‌: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మేడిన్ ఇటలీ అంటూ వ్యాఖ్యానించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ విగ్రహం గురించి రాహుల్ గాంధీ చేసిన మేడిన్ చైనా వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్‌ను మేడిన్ ఇటలీ ఎద్దేవా చేశారు. 

గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుంటే ఆ విగ్రహాన్నిమేడిన్ చైనా అంటూ రాహుల్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. రాహుల్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ పూర్తిగా మేడిన్ ఇండియా, గుజరాత్ అని నితిన్ పటేల్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిల్డర్లను బిడ్డింగ్‌ కోసం ఆహ్వానించామని అయితే ఆ కాంట్రాక్టు ఎల్‌ అండ్‌ టీకి దక్కిందన్నారు. ఎల్‌ అండ్ టీ భారత కంపెనీనే కదా అని ప్రశ్నించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం కోసం 1,700 టన్నుల కాంస్యాన్ని మాత్రమే చైనా నుంచి తీసుకువచ్చామని తెలిపారు. 70,000 టన్నుల ఇనుము, 18,500 టన్నుల స్టీల్ భారత్‌కు చెందినదేనని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా వృథాగా పడి ఉన్న ఇనుమును ప్రజల నుంచి సేకరించి వినియోగించినట్లు తెలిపారు. 

రాహుల్ వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు భారత ప్రజలు ముఖ్యంగా గుజరాతీల మనోభావాలను అవహేళన చేసేలా ఉన్నాయని విమర్శించారు. 

రాహుల్ గాంధీ శరీరంలో ఇటాలియన్‌ రక్తం ప్రవహిస్తోందని, ఆయన మేడిన్ ఇటలీ అంటూ నితిన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ సర్దార్ సాధించిన ఖ్యాతిని తుడిచేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబుట్టారు. భారత స్వాతంత్య్ర ఘనతను కేవలం నెహ్రూ-గాంధీ కుటుంబానికే చెందాలని తాపత్రయపడుతున్నారని నితిన్‌ పటేల్ మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios