రైల్వే కూలీగా రాహుల్ గాంధీ: న్యూఢిల్లీలో కూలీల సమస్యలు తెలుసుకున్న కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో రాహుల్ గాంధీ కొద్దిసేపు కూలీగా మారారు. రైల్వే కూలీల సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వేస్టేషన్ లో కొద్ది సేపు కూలీగా పనిచేశారు. రైల్వే స్టేషన్ లో పనిచేసే కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కూలీలు ధరించే ఎర్రచొక్కాను ధరించారు. రైల్వే కూలీలు తమ సమస్యలను తెలుసుకొనేందుకు రావాలని రాహుల్ గాంధీని కోరారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ఈ మేరకు విన్నవించారు. రైల్వే కూలీల వినతి మేరకు రాహుల్ గాంధీ ఇవాళ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు చేరుకుని వారితో కొద్దిసేపు ముచ్చటించారు. రైల్వే కూలీ మాదిరిగా కొద్ది సేపు గడిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాలను పంచుకుంది.
<
p>
భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలోని ప్రజలతో సంభాషించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. గత మాసంలో ఓ రైతు కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకున్నాడు. వారితో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. తానే స్వయంగా రైతు దంపతులకు భోజనం వడ్డించారు రాహుల్ గాంధీ.
బెంగాల్ లోని, ఢిల్లీలోని మార్కెట్లకు రాహుల్ గాంధీ వెళ్లి అక్కడి వారితో మాట్లాడిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఓ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ కు వెళ్లి అక్కడి విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. అంతేకాదు విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. ట్రక్ డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ లారీలో ప్రయాణించారు.