న్యూఢిల్లీ: ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.12 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ ప్రకటించారు.

సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.తొలుత ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు.ఈ పథకం వల్ల దేశంలోని 25 కోట్ల మంది ప్రజలకు సుమారు రూ.75వేల ఆర్ధిక సహాయం అందించే అవకాశం ఉందన్నారు.

నేరుగా  బ్యాంకు అకౌంట్లకు  ఈ డబ్బులను అందిస్తామని ఆయన చెప్పారు.ప్రతి నెల రూ. 12వేల కంటే తక్కువగా ఆదాయం ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయాన్ని ప్రజలకు అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన వివరాలను రాహుల్ వివరించారు.