Rahul on Power Crisis | దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఎవరిని నిందిస్తారని ప్రధాని మోడీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను విద్యుత్ సంక్షోభం కుదిపేస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరంట్ కోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ విమర్శలు గుప్పించారు.
Rahul on Power Crisis | దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఎవరిని నిందిస్తారని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశంలో ఓ వైపు ఉష్ణోగ్రతలు, మరోవైపు విద్యుత్ సంక్షోభం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరంట్ కోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ విమర్శలు గుప్పించారు.
ఈ వైఫల్యానికి మోదీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను బాధ్యులను చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తారా.. ప్రజలనే నిందిస్తారా అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ చేసిన కొన్ని పాత ప్రసంగాల్లోని వాగ్దానాలకు, ఉద్దేశాలకు మధ్య సంబంధం లేదన్నారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 24 గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంచుతామని 2015లో.. 2017లో బొగ్గు సంక్షోభ వార్తలు కనిపించడం లేదని మోదీ చేసిన ప్రసంగాల వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు. ఈ విద్యుత్ సంక్షోభంలో మోడీ వైఫల్యమైందనీ, ఈ విషయంలో ఎవరిని నిందిస్తారు? అని నిలదీశారు.
ఇదే వీడియోను కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా రిట్వీట్ చేస్తూ.. “మోదీ జీ, పవర్ స్టేషన్లలో బొగ్గు లేదు... ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు.. దేశవ్యాప్తంగా ఎండ కాలం తీవ్రమైన కరెంటు కోతలతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగో వంతు కంటే ఎక్కువ పవర్ ప్లాంట్లు మూసివేయబడ్డాయి. 700 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేయబడ్డాయి. అని నిలదీశారు.
పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనెట్ విలేకరులతో మాట్లాడుతూ.. వేసవి వచ్చిందంటే విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో.. ప్రభుత్వం ముందుగా సిద్ధమైందా? బొగ్గు సరఫరాకు సంబంధించి ఎలాంటి సన్నాహాలు చేశారు?స ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని రాష్ట్రాలను నిందిస్తోందనీ అన్నారు. ఆక్సిజన్ కొరతకు రాష్ట్రాలదే బాధ్యత, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్రాలదే బాధ్యత, బొగ్గు సరఫరా చేయకపోవడానికి రాష్ట్రాలదే బాధ్యత. అన్నింటికీ రాష్ట్రాలే బాధ్యులైతే కేంద్ర ప్రభుత్వం పనేమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సన్నద్ధత లేదని, అందుకే ఈ విద్యుత్ సంక్షోభం తలెత్తిందని సుప్రియ ఆరోపించారు.
ప్రధాని మోడీ కట్టిన గాలి మేడలు కూలిపోయాయని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విద్వేష బుల్డోజర్లు నడుపడం ఆపి, విద్యుత్ ఫ్యాక్టరీలు పని చేసేలా చూడాలని సూచించారు. ఇదిలా ఉంటే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పాలన, నిర్వహణాపర లోపాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని కాంగ్రెస్ ఆరోపించింది.
