కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం  రాత్రి లారీలో ప్రయాణించారు. హర్యానాలోని  ముర్తల్ నుంచి అంబాలా వరకు రాహుల్ గాంధీ లారీలో  జర్నీ చేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం రాత్రి లారీలో ప్రయాణించారు. హర్యానాలోని ముర్తల్ నుంచి అంబాలా వరకు రాహుల్ గాంధీ లారీలో జర్నీ చేశారు. లారీ డ్రైవర్ల సమస్యలను అర్థం చేసుకునేందుకుగాను రాహుల్ ఈ విధంగా ప్రయాణం కొసాగించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్రన పూర్తి చేసిన రాహుల్ గాంధీ.. ప్రస్తుతం వివిధ వర్గాలును కలుస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి రాహుల్ లారీలో ప్రయాణించారు. 

కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. రాహుల్ గాంధీ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న తన తల్లితో గడిపేందుకు అక్కడికి బయలుదేరారు. ఆయన హర్యానాలోని సోనిపట్‌లోని ఒక ధాబా వద్ద లారీ డ్రైవర్‌లను కలుసుకున్నారు. లారీలోనే అంబాలాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో లారీ డ్రైవర్ల పని, కష్టాల గురించి వారితో మాట్లాడారు.

Scroll to load tweet…

ఢిల్లీ నుంచి అంబాలాకు వెళ్తున్న హైవేపై పలు వాహనాల డ్రైవర్లు తమను దాటుకుంటూ వెళ్తున్న లారీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కో-డ్రైవర్ సీటులో కూర్చొని ఉన్న రాహుల్ ఇతర వాహనాల నుంచి తనను పలకరించిన వారి వైపు చేయి ఊపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక, అంబాలా చేరుకున్న తర్వాత రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా వైపు వెళ్లారు. 

Scroll to load tweet…

ఇక, రాహుల్ గాంధీ గత నెలలో బెంగాలీ మార్కెట్, జామా మసీదు ప్రాంతాలను సందర్శించారు. అక్కడ ప్రజల మధ్య స్థానిక ఆహారాన్ని ఆస్వాదించారు. అలాగే యూపీఎస్సీ అభ్యర్థులతో సంభాషించడానికి ఉత్తర ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని పీజీ మెన్స్ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.