Asianet News TeluguAsianet News Telugu

'ఇది నా తపస్సు': భారత్ జోడో యాత్ర అనుభవాలను పంచుకుంటూ రాహుల్ బహిరంగ లేఖ    

'ఇది నా తపస్సు' అంటూ రాహుల్ గాంధీ లేఖ ద్వారా 'భారత్ జోడో యాత్ర' అనుభవాలను పంచుకున్నారు. భారత్ జోడో యాత్ర అనుభవాలను పంచుకుంటూ  లేఖ విడుదల చేశారు. అలాగే.. హత్ సే హత్ జోడో యాత్రను కూడా పార్టీ ప్రారంభించనున్నట్లు లేఖలో పేర్కొన్నారు.  

Rahul Gandhi shares his Bharat Jodo Yatra experience in letter
Author
First Published Jan 13, 2023, 10:56 PM IST

భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా దాదాపు 3500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర పంజాబ్‌లో సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఆయన తన ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ బహిరంగ లేఖ రాశారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవిత లక్ష్యం ఏమిటో స్పష్టంగా వివరించారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవిత లక్ష్యం ఒక్కటేనని, హక్కుల కోసం పోరాడుతున్న బలహీనులకు రక్షణ కవచంలా ఉండాలని, ఎవరూ అణచివేతకు గురవుతున్నారో? ఎవరి గొంతు అణచివేయబడుతుందో వారి పక్షన నిలబెట్టాలని భారత్ జోడో యాత్ర వారికి నేర్పిందని రాహుల్ గాంధీ అన్నారు. 

భారత దేశాన్ని చీకటి నుంచి వెలుగులోకి, ద్వేషం నుంచి ప్రేమలోకి, నిరాశ నుంచి ఆశలోకి తీసుకెళ్లడమే తన కల అని లేఖలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మన మహానుభావులు చెప్పిన సూత్రాలు, విలువలను ఆదర్శంగా తీసుకొని తాను ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. యువత నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతోందనీ, దేశమంతటా నిస్పృహ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఒక మతానికి మరో మతానికి, ఒక కులానికి మరో కులానికి, ఒక భాషాకి మరో భాషకు మధ్య విభేదాలు, వైరుధ్యాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

ద్వేషం ఎలా అంతమౌతుంది? 
 
పరస్పర ద్వేషాలు, కలహాలు మన దేశాభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయని రాహుల్ గాంధీ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సమాజంలో చెడును సృష్టించే కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా మనమందరం ఎదుగుతామనే నమ్మకం తనకు ఉందనీ, భయపడవద్దనీ,  హృదయం నుండి భయాన్ని తొలగించండనీ, ద్వేషం కూడా తొలగిపోతుందని అని సూచించారు.

'నేను పోరాడతాను'

ప్రతి క్షణం దుర్మార్గాలపై పోరాడతానని రాహుల్ గాంధీ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు సామాజిక శ్రేయస్సుతో పాటు ఆర్థిక శ్రేయస్సు కోసం సమాన అవకాశాలు ఉన్న భారతదేశాన్ని నిర్మించాలని తాను సంకల్పించాననీ,  రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి, చిన్న,మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహం,డీజిల్-పెట్రోల్ చౌకగా ఉండాలి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలోపేతం వంటి అంశాలపై తాను పోరాటం సాగిస్తానని అన్నారు. ఇదే తన సందేశం అని అన్నారు. 


మరోవైపు.. రాబోయే రెండు నెలల పాటు 'హత్ సే హత్ జోడో' పేరుతో భారీ ప్రచారం నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. ఈ యాత్ర గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించనున్నారు. పార్టీ అధ్యక్షుడు తర్వాత తొలి సమావేశంలోనే మల్లికార్జున్ ఖార్కే ఇచ్చిన సమాచారం..  ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు/సభ్యులు దాదాపు 2.5 లక్షల గ్రామపంచాయతీలు, ఆరు లక్షల గ్రామాలు, 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను కవర్ చేయనున్నారు.

పార్టీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం సాగనున్నది. ఇందుకోసం ప్రతి రాష్ట్ర రాజధానిలో మహిళా యాత్ర, పాదయాత్రలు చేపడతారు.హత్ సే హత్ జోడో ప్రచారంతో పాటు, రాహుల్ గాంధీ లేఖ, ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యంపై ఛార్జ్ షీట్ దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని తెలిపారు. 

2022, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ నాయకత్వంలో విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర పంజాబ్‌లో ఉంది. ఈ యాత్ర ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఢిల్లీని కవర్ చేసింది. ఈ యాత్ర పార్టీని బలోపేతం చేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios