Asianet News TeluguAsianet News Telugu

అమర్ జవాన్ జ్యోతిని గుర్తు చేస్తూ.. రిపబ్లిక్ డే రోజున..రాహుల్ గాంధీ ట్వీట్..!

ఐదు దశాబ్ధాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేసింది. ఈ అమర జవాన్ జ్యోతిని.. యుద్ధ స్మారక జ్యోతిలో కలిపేశారు. రెండు జ్యోతులను నిర్వహించడం కష్టంగా ఉన్న కారణంగానే… ఈ రెండిటినీ కలిపేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Rahul Gandhi Shares Eternal Flame Photo In Dig At Centre On Republic Day
Author
Hyderabad, First Published Jan 26, 2022, 3:57 PM IST

నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే..  రాహుల్ గాంధీ మాత్రం భిన్నంగా  స్పందించారు.  ఇటీవల వార్ మోమోరియల్ లో అమర్ జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దానిని  గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ ట్వీట్  చేశారు.

ఐదు దశాబ్ధాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేసింది. ఈ అమర జవాన్ జ్యోతిని.. యుద్ధ స్మారక జ్యోతిలో కలిపేశారు. రెండు జ్యోతులను నిర్వహించడం కష్టంగా ఉన్న కారణంగానే… ఈ రెండిటినీ కలిపేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే రాహుల్ గాంధీ మండిపడ్డారు.  రాహుల్ గాంధీ ఏకంగా.. కొందరికి దేశంపై ప్రేమ, బలిదానాలు అర్థం కావు అని ట్వీట్ చేశారు. అమర జవాన్ జ్యోతిని ఆర్పేస్తారని పేర్కొన్నారు. అయితే, మన సైనికుల కోసం మరోసారి జ్యోతిని వెలిగిస్తామని తెలిపారు.

 

తాజాగా.. రిపబ్లిక్ డే రోజున.. జాతీయ జెండాకు ముందు.. అమర జవాన్ జ్యోతి ని ఉంచి.. ఆ ఫోటోని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. "1950లో గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం సరైన దిశలో మొదటి అడుగు వేసింది. ఆ మొదటి అడుగు సత్యం , సమానత్వం.. వాటికి నా సెల్యూట్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్" అని కాంగ్రెస్ నాయకుడు  రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా..  1971 సంవత్సరంలో ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతి ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972 సంవత్సరంలో అమర్ జవాన్ జ్యోతి ని ప్రారంభించారు. 2019లో జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios