Asianet News TeluguAsianet News Telugu

‘ఆ అమ్మాయితో, అప్పుడే నా పెళ్లి...’ వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో...

దేశంలోనే  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ గా ఉన్న 52 యేళ్ల రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన వివాహం గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

Rahul Gandhi says.. I Will Get Married When...that girl found - bsb
Author
First Published Jan 23, 2023, 1:29 PM IST

న్యూఢిల్లీ : సరైన అమ్మాయి వస్తేనే పెళ్లి చేసుకుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు పంచుకున్న ఇంటర్వ్యూలో తెలిపారు. రాహుల్ గాంధీ, 52, దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ గా ఉన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా సోషల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ లోని ఓ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో  తన వివాహం గురించిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు.

కర్లీ టేల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన కాబోయే భాగస్వామి కోసం.. ఎలాంటి చెక్ లిస్ట్ లేదని చెప్పుకొచ్చారు. సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. కర్లీటేల్స్ కు చెందిన యాంకర్ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ..."మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అమ్మాయి కోసం  ఏమైనా చెక్ లిస్ట్ ఉందా?’ అని అడిగారు. దీనికి సమాధానంగా ఆయన అలా చెప్పుకొచ్చారు. చెక్ లిస్ట్ ఏమీ లేదని ప్రేమగా చూసుకునే అమ్మాయి, తెలివిగలది అయితే చాలు.. అని అన్నారు. 

దీనికి ఆమె నవ్వుతూ.. అయితే చాలామంది అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు అంటూ సరదగా నవ్వేశారు. దీనికి ఆయన కూడా సరదాగా నవ్వేస్తూ.. నన్ను ఇప్పుడు మీరు ఇబ్బందుల్లో పడేశారు" అన్నారు. డిసెంబరులో, రాహుల్ గాంధీ ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి సోనియా గాంధీ, తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి లక్షణాలను తన భాగస్వామిలో కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

"నేను స్త్రీకి ప్రాధాన్యత ఇస్తాను.. ఆమె అభిప్రాయాలు, లక్షణాలతో నాకెలాంటి సమస్యా లేదు. కానీ, మా అమ్మ, నాన్నమ్మల లాంటి లక్షణాల కలయిక ఉంటే మంచిది," అని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అతను ఇందిరా గాంధీ గురించి చెబుతూ "నాన్నమ్మ నాకు రెండో తల్లి.. నా జీవితంలో ప్రేమకు చిరునామా" అని కూడా అభివర్ణించాడు.

రాహుల్ గాంధీ 129 రోజుల్లో 12 రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు. ప్రస్తుతం అతని పాదయాత్ర జమ్మూలో జరుగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగుస్తుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios