Asianet News TeluguAsianet News Telugu

'నా ఇమేజ్‌ను నాశనం చేసేందుకు బీజేపీ కోట్లు ఖర్చు చేసింది. కానీ...': రాహుల్ గాంధీ 

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొనసాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ సైక్లిస్ట్‌గా మారారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకపడ్డారు. 

rahul gandhi says BJP spent thousands of crores of rupees to spoil my image
Author
First Published Nov 28, 2022, 5:24 PM IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకపడ్డారు. తన ప్రతిష్టను చెడగొట్టడానికి అధికార బీజేపీ వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు, అయితే.. సత్యం తన వైపు ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొనసాగుతోంది. ఈ యాత్ర నేడు  ఇండోర్‌లోని బడా గణపతి కూడలి నుండి ఉదయం ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీకొద్దిసేపు సైకిల్ తొక్కారు. ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇండోరి కుమారుడు సత్లజ్ రాహత్ కలిసి ముందుకు సాగారు. ఈ తరుణంలో అతడు రాహుల్ గాంధీకి తన దివంగత తండ్రికి అంకితం చేసిన పుస్తకాలను బహుకరించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందనీ,కానీ.. అది తన నేడు ప్రయోజనకరంగా మారిందని అన్నారు. సత్యం గురించి పోరాడుతున్నట్లయితే.. వ్యక్తిగత దాడులు ఖచ్చితంగా జరుగుతాయని అన్నారు. తాను సరైన పని చేస్తున్నానని అనుకుంటున్నానని, మెల్లమెల్లగా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల ఆలోచనలను బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టానని అన్నారు.  తనపై బీజేపీ వ్యక్తిగత దాడులు చేస్తుందని, కానీ వాటిని సరైన దిశలో ఎదురిస్తున్ననని అన్నారు. 

గెహ్లాట్‌, సచిన్‌ లు పార్టీ ఆస్తులు 

అదే సమయంలో రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య జరుగుతున్న పోరుపై మాట్లాడుతూ.. ఈ ఇద్దరు నేతలూ మన ఆస్తులేనన్నారు. ఇది రాజస్థాన్‌లోని భారత్ జోడో యాత్రను ప్రభావితం చేయదని తాను హామీ ఇస్తున్నానని అన్నారు. 

సింధియా మద్దతుదారులు ఎంట్రీపై రాహుల్ స్పందన!

సింధియా మద్దతుదారులు కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారనే ప్రశ్నకు రాహుల్ గాంధీ  సమాధానమిస్తూ.. ఈ ప్రశ్నను కాంగ్రెస్ అధ్యక్షుడిని, రాష్ట్ర నాయకత్వాన్ని అడగాలని అన్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులను తిరిగి విశ్వసించకూడదని.. అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పాడు. 

అమేథీ నుంచి పోటీ చేయడంపై మీరు ఏం చెప్పారు?

అమేథీ నుంచి పోటీ చేస్తారా?  అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అయితే ఈ విషయాలన్నీ భారత్ జోడో యాత్ర యొక్క ప్రధాన ఆలోచన నుండి దృష్టి మరల్చుతున్నాయని రాహుల్ గాంధీ బదులిచ్చారు. రాహుల్ అమేథీలో పోటీ చేస్తారా లేదా అని రేపటి దినపత్రికలో రాయాలనుకుంటున్నారా? .. ఈ ప్రశ్నకు ఏడాదిన్నర తర్వాత సమాధానం చెబుతాను. నా దృష్టి భారత్ జోడో యాత్రపై ఉందని అన్నారు. 

నిరుద్యోగంపై రాహుల్‌ ఏం చెప్పారు?

ద్రవ్యోల్బణం,నిరుద్యోగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  నిరుద్యోగానికి అతిపెద్ద కారణమనీ, భారతదేశం యొక్క మొత్తం సంపదను ముగ్గురు నుండి నలుగురు చేతుల్లోకి వెళ్తుందని అన్నారు.డీమోనిటైజేషన్, జీఎస్టీతో చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారని, రైతులకు బీమా ఎరువులు అందడం లేదని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios