Asianet News TeluguAsianet News Telugu

రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై రాహుల్ ఫైర్ 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజ్యాంగాన్ని తెలివిగా "అంతం" చేయాలనుకుంటున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జన్మస్థలమైన మోవ్‌కు భారత్‌ జోడో యాత్ర చేరుకున్న అనంతరం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

Rahul Gandhi says BJP, RSS Want To Finish Off Constitution Discreetly
Author
First Published Nov 27, 2022, 10:29 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచపడ్డారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణ చేశారు. కానీ, ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందని అన్నారు.  

మధ్యప్రదేశ్ లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ  రాజ్యాంగ దినోత్సవం రోజున ( నవంబర్ 26న) ఇండోర్ జిల్లాలోని డాక్టర్ అంబేద్కర్ జన్మస్థలమైన మోవ్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, పలువురు కేంద్ర అధికారులు, పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి.. నివాళులర్పించారు. 

అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై విమర్శాస్త్రాలు సంధించారు. దాదాపు 35 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో.. కాంగ్రెస్ నాయకుడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల గురించి కూడా మాట్లాడారు. తన రాజకీయ శత్రువులతో సహా ఎవరిపైనా ఇప్పటికీ ద్వేషం లేదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 52 సంవత్సరాలుగా ఓ సంస్థ మన ప్రియమైన త్రివర్ణాన్ని దాని కార్యాలయంపై ఎగరవేయలేదని, దానికి కారణమేమిటని ప్రశ్నించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ జీ.. (అలాంటి) గొప్ప వ్యక్తులు మనకు రాజ్యాంగాన్ని అందించారని ఆయన అన్నారు. మన దేశ రాజ్యాంగం రాబోయే తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. 

భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హోదా కల్పించిందనీ, అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. కానీ బీజేపీ, సంఘ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి, సంఘ్ ప్రజలు ముందు నుండి ఈ పని చేయలేరని రాహుల్ గాంధీ అన్నారు. గత కొన్ని ఏండ్లుగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వారు తమ సొంత వ్యక్తులను (బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్) రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 

అయితే.. ఇక నుంచి వారి ఆటలు సాగవని, ఇందుకోసమే దేశంలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి, సంఘ్‌ల విధానాలు పేదలు, కార్మికులు, రైతులు, ఇతర వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అభివర్ణించిన ఆయన.. దేశంలోని ముగ్గురు, నలుగురు బిలియనీర్లకు లబ్ధి చేకూర్చే విధానాలపైనే కేంద్రం పనిచేస్తుందని అన్నారు. పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులకు కేంద్రం ఏమీ చేయడం లేదనీ,  ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోందని అన్నారు. యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వ హయాంలో గ్యాస్ సిలిండర్ రూ.400 ఉండేదని 

బీజేపీ పాలనలో సిలిండర్ ధర  వెయ్యి రూపాయలు దాటింది. పెట్రోలు ధర వంద రూపాయాలు దాటింది. డీజిల్ ధర కూడా రెక్కాలొచ్చాయని కేంద్రంపై విరుచకపడ్డారు. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా మీదుగా ఇండోర్ జిల్లాకు చేరుకుంది. ఈ యాత్ర శనివారం  సాయంత్రం మోవ్‌కు చేరుకుంది. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. నాయకులంతా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios