UP Elections 2022:  ఎన్నిక‌లు పూర్తి అయిన వెంట‌నే మళ్లీ పెట్రోలు రేట్లు భారీ స్థాయిలో పెరుగుతాయ‌నీ,  త్వరగా పెట్రోల్‌ ఫుల్‌ట్యాంక్‌ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్‌’ అయిపోతుంది’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.  

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో అన్ని దశల్లో పోలింగ్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి దశ పోలింగ్‌కు రెండు రోజు ముందే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బీజేపీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా కేంద్ర‌ ప్రభుత్వంపై వంగ్యాస్త్రాలు సంధించారు. మరో రెండు రోజుల్లో యూపీలో చివరి దశ పోలింగ్ అయిపోతుందని, ఈ క్రమంలో.. వెంట‌నే ముందస్తుగా.. వాహనాల‌ను పుల్ ట్యాంక్ చేయించుకోండ‌ని ప్రజలకు సలహా ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయని ఆరోపించారు.

ఎన్నిక‌లు పూర్తి అయిన వెంట‌నే మళ్లీ పెట్రోలు రేట్లు భారీ స్థాయిలో పెరుగుతాయ‌నీ, త్వరగా పెట్రోల్‌ ఫుల్‌ట్యాంక్‌ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్‌’ అయిపోతుంది’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అబద్ధాల ఆధారంగా ఓట్లు అడుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. వారణాసిలోని పింద్రాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "నేను చనిపోతాను. కానీ, మీ బ్యాంకు ఖాతాల్లో ₹15 లక్షలు జమ చేస్తానని, ఎప్పటికీ చెప్పను. అది మీకు మంచి లేదా చెడు అనిపించినా నేను పట్టించుకోను. నేను మీ అందరినీ గౌరవిస్తాను. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెబుతాడు. హిందూ మతాన్ని రక్షిస్తాను అని చెప్పాడు, కానీ, ఆయ‌న అబద్ధాలను రక్షిస్తాడు. వారు దేశమంతా హిందూ మతం గురించి మాట్లాడతారు. హిందూ మతం అంటే ఏమిటి? చెప్పండి? నిజంగా.. వారు హిందూ మతం పేరు మీద ఓట్లు అడగరనీ, ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. "
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏడు దశల ఎన్నికలు మార్చి 7న ముగియనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.

రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు శుక్రవారం బ్యారెల్‌కు 111 డాలర్లకు పైగా పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెరుగుతున్న ముడి చమురు ధరల బాధను భరిస్తుండటంతో, తుది వినియోగదారులకు ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లాక్ చేశాయని తెలిపారు. వచ్చే వారం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచే అవకాశం ఉందని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడవ దశ(చివరి) పోలింగ్ సోమవారం ముగిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. దేశీయ ఇంధన ధరల పెరుగుదల అంతర్జాతీయ చమురు ధరల మీద ఆధాపడి ఉంటుంది. ఎందుకంటే సుమారు 85 శాతం చమురు అవసరాలను భారత్‌.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గత 118 రోజులు నుంచి భారత్‌లో ఇందన ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటం గమనార్హం​. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం వల్లనే చమురు ధరలు స్థిరంగా ఉ‍న్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి.