కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రయాణీస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో అత్యవసరంగా రాహుల్ గాంధీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రయాణీస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో అత్యవసరంగా రాహుల్ గాంధీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో బీహర్‌కు బయలుదేరారు.
Scroll to load tweet…
బీహర్ రాష్ట్రంలోని సమస్తీపూర్, ఒడిశాలోని బాలసోర్ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ శుక్రవారం నాడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ, రాహుల్ ఢిల్లీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రాహుల్ ప్రయాణీస్తున్న విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు.
విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలకు తాను ఆలస్యంగా హాజరయ్యే అవకాశం ఉందని రాహుల్ గాంధీ ప్రకటించారు
