Asianet News TeluguAsianet News Telugu

100 రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర.. యాత్రలోని ప్రధాన ఘట్టాలు..  

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన జైపూర్‌లోని కొత్త పీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీకి ఇదే తొలి మీడియా సమావేశం. ఆ సందర్భంగా ఆయన 100 రోజులు అనుభావాలను పంచుకోనున్నారు. 

Rahul Gandhi's Bharat Jodo Yatra Completes 100 Days
Author
First Published Dec 16, 2022, 12:49 PM IST

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.'నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ద్వేషానికి వ్యతిరేకంగా, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న యాత్రను ఎవరూ ఆపలేకపోయారు, ఆపలేరు' అని రాహుల్ ట్వీట్ చేశారు.రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. డిసెంబర్ 16వ తేదీతో రాహుల్ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాహుల్‌ యాత్ర అనేక రాష్ట్రాల మీదుగా రాజస్థాన్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ యాత్ర 70 శాతం పూర్తయింది. రాజస్తాన్ తరువాత రాహుల్ యాత్ర హర్యానాలో ప్రవేశించనుంది. నేడు భారత్ జోడో యాత్ర 22 కిలోమీటర్ల మేర సాగనుంది.

రాహుల్ గాంధీ తన 100 రోజుల పర్యటనలో 8 రాష్ట్రాల్లోని 42 జిల్లాల్లో 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌లో ఈ యాత్ర సాగింది. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల గుండా వెళుతోంది.ఈ సమయంలో రాహుల్ నేరుగా ప్రజలతో సంభాషించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ యాత్ర డిసెంబరు 24న ఢిల్లీలో ప్రవేశించి, ఎనిమిది రోజుల విశ్రాంతి తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా , పంజాబ్ మీదుగా జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది. 

100 రోజులు పూర్తి 

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఒకే దశలో 22 కి.మీ మేర సాగనున్నది. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు  రాహుల్ గాంధీ జైపూర్‌లోని నూతన కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ మొదటి విలేకరుల సమావేశం ఇదే. నేటి భారత్ జోడో యాత్రలో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో రాహుల్ జైపూర్ వెళ్లనున్నారు.

మీడియా సమావేశం..

భారత్ జోడో యాత్ర 100వ రోజు సందర్బంగా ఈ రోజు సాయంత్రం జైపూర్‌లో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ తన ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకొనున్నారు. ఈ యాత్రలో ఆయన అట్టడుగు స్థాయి కార్యకర్తలను, ప్రజలను పార్టీతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నుంచి రాహుల్ అనేక  విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రాహుల్‌ తన యాత్రలో పిల్లలను వాడుకుంటున్నారనీ, వారితో ఫోటోలు దిగుతున్నారని, అతని టీ-షర్టులు పై  విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అంతే కాదు గడ్డం విషయంలో కూడా ఆయనపై వ్యక్తిగత దాడులు జరిగాయి. అయినా .. ఇప్పటివరకూ ఈ యాత్ర ఎక్కడ కూడా ఆగలేదు. 

వాస్తవానికి ఈ పాదయాత్ర ఉద్దేశం 2024 లోక్‌సభ ఎన్నికలేనని భావించినా, ఈ యాత్ర వల్ల పార్టీకి ఎంత మేలు జరుగుతుందో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో తేలిపోతుంది. ఈ పర్యటనతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పునరుద్ధరణ బాటలో పయనిస్తున్న కాంగ్రెస్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయని కాంగ్రెస్ పార్టీని నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు భావిస్తున్నారు.అయితే.. ఈ యాత్ర ఎన్నికల ప్రయోజనాలను పొందడంలో విజయవంతమవుతుందా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.

2,800 కిలోమీటర్ల యాత్ర పూర్తి 

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న భారత్ జోడో యాత్ర గత మూడు నెలలుగా అనేక వివాదాలకు వేదికైంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గడ్డం, బుర్బెర్రీ టీ-షర్ట్ కూడా అవహేళన జరిగింది. ఇప్పటివరకు 2,800 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన రాహుల్ తన మద్దతుదారులతో పాటు ప్రత్యర్థుల దృష్టిని ఆకర్షించడంలో సఫలమయ్యారనే చెప్పాలి. ఈ యాత్రలో సినీ తారల నుంచి విద్యారంగ నిపుణుల వరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని.. రాహుల్ గాంధీ వెంట నడిచారు. ఆయనకు మద్దతుగా నిలిచారు.ఈ పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. 

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారానికి దూరంగా ఉండటంపై ఆయన అనేక విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. మరోవైపు.. భారత్ జోడో యాత్ర ఎన్నికల ప్రయోజనంగా మారుతుందా? అనే ప్రశ్నలు తల్లెతున్నాయి. ఇటీవల ముగిసిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. హిమాచల్‌లో ఆ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించగా, గుజరాత్‌లో ఘోర పరాజయం పాలైంది.  గతంలో కంటే..తక్కువ సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి.

ఎన్నికల ఫలితాలతోనే తేలనున్న ప్రయోజనం 

వచ్చే ఏడాది కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలపై భారత్ జోడో యాత్ర ప్రభావం చూపనున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంలో భారత్ జోడో యాత్ర విజయవంతమైందని అందరూ అంగీకరించారు. అయితే యాత్ర  నిజమైన ప్రభావం ఎన్నికల ఫలితాల నుండి వస్తుందని భావిస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యాత, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) ప్రొఫెసర్ సంజయ్ పాండే మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు ఆశాకిరణాన్ని అందించిందని, పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. అయితే.. ఆ యాత్ర ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది వేచి చూడాల్సిందే.

రాహుల్‌తో కలిసి నడిసిన  ప్రముఖ సెలబ్రిటీలు 

పూజా భట్, రియా సేన్, సుశాంత్ సింగ్, స్వర భాస్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి, అమోల్ పాలేకర్ వంటి సినీ, టీవీ ప్రముఖులతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు యాత్రలో పాల్గొన్నారు. అలాగే.. మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్, శివసేన నాయకుడు ఆదిత్య థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) సుప్రియా సూలే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి పలువురు ప్రముఖులు కూడా రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.  

సద్దాం హుస్సేన్‌ లా రాహుల్ గాంధీ … అస్సాం సీఎం

ఈ పర్యటన కూడా వివాదాలతో ముడిపడి ఉంది. తమిళనాడులో రూ. 41,000 విలువైన బుర్‌బెర్రీ టీ-షర్ట్‌ను ధరించారని ఆరోపిస్తూ రాహుల్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ దాడికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్..టీ ప్రధాని నరేంద్ర మోదీపై టార్గెట్ చేసింది. ప్రధాని రూ.10 లక్షల సూట్‌ చేసుకుంటున్నారని తిప్పి కొట్టింది. దీంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత కాలుతున్న ఖాకీ ప్యాంటు చిత్రాన్ని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అదే సమయంలో వివాదాస్పద క్రైస్తవ మతగురువుతో రాహుల్ గాంధీ భేటీకి సంబంధించిన వీడియోపై బీజేపీ మండిపడింది. ఇటీవల రాహుల్ గడ్డం విషయంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్ గాంధీ.. ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గుజరాత్‌లో ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తుంది. ఆయన ట్రోలర్ లా కనిపిస్తున్నాడని సమాధానమిచ్చింది. 

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై దాడి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బిజెపి ప్రభుత్వాన్ని నిన్న రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మహిళలను అణిచివేస్తోందని రాహుల్ ఆరోపిస్తూ.. ఆ సంస్థలో మహిళా సభ్యులు లేకపోవడానికి ఇదే కారణమని ఆరోపించారు. భయాన్ని వ్యాప్తి చేయడమే బీజేపీ, ఆరెస్సెస్ ప్లాన్ అని, భయం, ద్వేషానికి వ్యతిరేకంగా తమ పాదయాత్ర సాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అంతే కాదు 'జై సియారామ్' అని కాకుండా 'జై శ్రీరామ్' అంటూ సీతాదేవిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios