కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తన వివాహం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తన వివాహం గురించి పెదవి విప్పారు. ఇటీవల ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ తన వ్యక్తిగత, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన సోదరి ప్రియాంక గాంధీతో అనుబంధాన్ని వెల్లడించారు. తనకు భారతీయ నానమ్మ( ఇందిరా గాంధీ)తో ఎక్కువ చనువు ఉండేదనీ, తన సోదరి ప్రియాంక ఇటాలియన్ అమ్మమ్మ(పావోలా మైనో )తో ఎక్కువ చనువు ఉండేదని అన్నారు.

ఈ ఇంటర్య్వూలో కూడా రాహుల్ గాంధీ తన వివాహం గురించి తరచుగా అడిగే ప్రశ్నను ఎదుర్కొన్నాడు. ఇంతవరకూ ఎందుకు పెళ్లి చేసుకోలేదని రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. “వింతగా ఉంది...నాకు తెలియదు. చాలా పనులు చేయాల్సి ఉంది. కానీ, తనకు పెళ్లి చేసుకోవాలని ఉండనీ, తాను కూడా పిల్లలను తండ్రిగా ఉండాలనుకుంటున్నాను.” అని ఆసక్తికర సమాధానమిచ్చారు.

గడ్డం ఎప్పుడు కత్తిరించుకుంటారు?

అలాగే..రాహుల్ గాంధీ తన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు సాగిన భారత్ జోడో యాత్ర అనుభవాలను కూడా పంచుకున్నారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ గడ్డం పెంచారు. అతని గడ్డం గురించి ప్రశ్నించగా.. ఆయన ఇలా చెప్పాడు. "నేను మొత్తం ప్రయాణంలో నా గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను దానిని ఉంచాలా వద్దా అని నిర్ణయించుకోవాలి." అన్నారు.

బామ్మతో సంబంధంపై రాహుల్ గాంధీ ఏం చెప్పారు?

రాహుల్ గాంధీ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. తనకు భారతీయ నానమ్మ( ఇందిరా గాంధీ)తో ఎక్కువ చనువు ఉండేదనీ, నానమ్మ అంటే.. చాలా ఇష్టమని, తన సోదరి ప్రియాంక ఇటాలియన్ అమ్మమ్మ(పావోలా మైనో )తో ఎక్కువ చనువు ఉండేదని అన్నారు. మొత్తం కుటుంబం తనతో చాలా అప్యాయతతో ఉంటారని తెలిపారు. పావోలా మైనో గతేడాది ఆగస్టులో ఇటలీలో మరణించారు.

ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఫిబ్రవరి 1న ప్రచురించిన ఒక వార్తాపత్రిక ఇంటర్వ్యూలో.. ప్రజాస్వామ్య నిర్మాణాలు కుప్పకూలడం, పార్లమెంటు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల భారతదేశంలోకి ఫాసిజం ప్రవేశించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ప్రదర్శిస్తే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించవచ్చని కాంగ్రెస్ నేత అన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ప్రధాని మోదీని ఓడించగలరా అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు ఏకమైతే నూటికి నూరు శాతం. "ప్రధాని మోడీని ఖచ్చితంగా ఓడిపోతాడని తాను చెప్పలేదు. విపక్షాలు ఏకమైతే ..తప్పకుండా ఓడించగలనని చెప్పాను. మీరు కుడి లేదా ఎడమతో సంబంధం లేని దృష్టిని వ్యతిరేకించారు, కానీ శాంతి, ఐక్యతతో. ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా ఫాసిజం ఓడిపోయింది. భారతదేశం యొక్క రెండు దృక్పథాలు ఒకదానికొకటి ఓటింగ్‌లో తలపడితే.. మనం విజయం సాధించగలము, ”అని ఆయన నొక్కి చెప్పారు.