కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో పోలిస్తే... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. కాగా... తాజాగా ఆయన తన ట్విట్టర్ ఫాలోవర్స్ కి దన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే... ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య కోటికి చేరింది. ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ తెలియజేశారు.

 ‘‘కోటి మంది ట్విటర్‌ అనుచరులారా-ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు! ఈ మైలురాయిని ఈరోజు అమేఠీలో నేను కలవబోతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానుల మధ్య సెలబ్రేట్‌ చేసుకుంటాను’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

మొన్నటి దాకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఇటీవల ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ.. ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతాలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానిని  కాంగ్రెస్ నేతగా మార్చుకున్నారు.