Asianet News TeluguAsianet News Telugu

స్నేక్  బోట్ రేస్‌లో పాల్గొన్న రాహుల్ గాంధీ..   వీడియో వైర‌ల్ 

కాంగ్రెస్‌ 'భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ.. పున్న‌మాడ లేక్‌లో నిర్వ‌హించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిష‌న్‌లో పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో బోటు న‌డిపాడు. ఈ పోటీల్లో పాల్గొనే వారిలో ఉత్స‌వం నింపారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rahul Gandhi Makes A Splash, Participates In Kerala Snake Boat Race
Author
First Published Sep 20, 2022, 5:23 AM IST

కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ నిర్వ‌హిస్తున్న‌ 'భారత్‌ జోడో యాత్ర కు విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ క్ర‌మంలో రాహుల్ దేశ ప్ర‌జ‌ల‌ భిన్నమైన శైలుల‌ను, వారి జీవ‌న చిత్రాల‌ను చాలా ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుని వారికి భ‌రోసా ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  తాజాగా రాహుల్ గాంధీ సంబంధించిన‌ మరొక వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది, అందులో ఆయ‌న పడవ నడుపుతున్నట్లు కనిపిస్తాడు.

వివ‌రాలోకెళ్తే.. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కేర‌ళ‌లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఆయన‌ పున్న‌మాడ లేక్‌లో నిర్వ‌హించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిష‌న్‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో బోటు న‌డిపాడు. ఈ పోటీల్లో పాల్గొనే వారిలో ఉత్స‌వం నింపారు. రాహుల్ బోటు రేసులో పాల్గొన్న వీడియోను ఇండియ‌న్ యూత్ కాంగ్రెస్ నేష‌న‌ల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బీవీ త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేస్తూ..  'అలలకు భయపడితే పడవ ముందుకు సాగ‌దు. ప్రయత్నించే వారు ఓడిపోరు. అని క్యాప్ష‌న్  రాసుకోచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

మత్స్యకారులతో రాహుల్ చర్చ‌..

12వ రోజు యాత్ర కేర‌ళ‌లోని వడ్కల్ లో ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ సోమవారం ఉదయం వడ్కల్ బీచ్‌లో మత్స్యకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతో ఇంధన ధరలు పెరగడం, సబ్సిడీల తగ్గింపు, చేపల నిల్వలు తగ్గిపోవడం, పర్యావరణానికి నష్టం వంటి పలు సవాళ్లపై చర్చించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ..  "పెరుగుతున్న ఇంధన ధరలు, సబ్సిడీల తగ్గింపు, చేపల నిల్వలు క్షీణించడం, పింఛను రాకపోవడం, విద్యకు తగిన అవకాశాలు లేకపోవడం, పర్యావరణానికి నష్టం వంటి సవాళ్లపై రాహుల్ గాంధీ ఉదయం 6 గంటలకు అలప్పుజాలో ప్రసంగించారు. అని పోస్టు చేశారు. 

భారత జోడో యాత్ర 12వ రోజు

12వ రోజు యాత్ర పున్నపర నుండి ప్రారంభమైంది. గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధరన్, కె సురేష్, రమేష్ చెన్నితాల, కెసి వేణుగోపాల్, కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు విడి సతీషన్ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.  ఈ ప్రయాణంలో ఇప్పటి వరకు రాహుల్ 200 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించారు. కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర' 150 రోజుల్లో పూర్తవుతుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 3570 కి.మీ పాద‌యాత్ర చేయ‌నున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది.

కేరళలో 450 కిలోమీటర్ల ప్రయాణం

సెప్టెంబర్ 10 సాయంత్రం కేరళలో ప్రవేశించిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 1న కర్ణాటకలో ప్రవేశిస్తుంది. ఈ 19 రోజుల్లో ఏడు జిల్లాల గుండా 450 కిలోమీటర్ల దూరం పాద‌యాత్ర సాగ‌నున్న‌ది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల (కేరళ) గుండా సాగుతుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఆదివారం కేరళలోని హరిపాడ్ నుండి తిరిగి ప్రారంభమైందని, ఇందులో వందలాది మంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios