కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎంపీ రాహూల్ గాంధీ చేపట్టడం ఖాయమైపోయింది. అయితే ఢిల్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తారా? అయితే ఈ విషయాన్ని ఢిల్లీ వేదికగా ప్రకటిస్తారా? వేరే వేదికగానా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

కొత్త సంవత్సరంలో ఢిల్లీ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ నిర్వహిస్తారని, ఆ ప్లీనరి వేదికగా రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ ఈ వేదికను మార్చినట్లు సమాచారం. ఢిల్లీ వేదికగా కాకుండా ఏఐసీసీ ప్లీనరిని రాజస్థాన్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. 

ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అధిష్ఠానంతో చర్చించి, ఈ నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాజస్థాన్‌లో ఏ ప్రాంతంలో ప్లీనరీని నిర్వహించాలన్నది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. 

రాహుల్ గాంధీ విదేశాల నుంచి తిరిగి రాగానే ప్లీనరి నిర్వహించే ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అయితే 2012 లో జైపూర్ లో కాంగ్రెస్ ప్లీనరి జరిగింది. ఈ వేదికగానే రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పార్టీ ప్రకటించింది.