కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. రాహుల్ యూరప్‌కు వెళ్లారని.. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సమాచారం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. రాహుల్ యూరప్‌కు వెళ్లారని.. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సమాచారం. అయితే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన తిరిగి స్వదేశానికి చేరుకుంటారని చెబుతున్నారు. ఆదివారం ఆయన ఇండియాకు చేరుకనే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఆయన నాయకత్వ నిబద్దతపై అనే ప్రశ్నలకు తావిస్తోంది.
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒక చోట కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు సందర్భాల్లో రాహుల్ విదేశీ పర్యటనలు చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా గోవా కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న వేళ.. రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
మరోవైపు గురువారం జరిగే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి కూడా రాహుల్ గాంధీ అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. పార్టీ కొత్త ప్రెసిడెంట్ కోసం సంస్థగత ఎన్నికలు, పార్టీ చేపట్టున్న జోడో యాత్ర గురించి చర్చించడానికి గురువారం సమావేశం కానుంది. అయితే ఈ కీలక సమావేశానికి కూడా రాహుల్ అందుబాటులో.. వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లడంతో రాహుల్ నాయకత్వ నిబద్దతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబతున్నారు.
ఇక, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత.. అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ రాజీనామాతో సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మరోసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు.
ఇక, ఈ ఏడాది మే నెలలో.. రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులోని నైట్‌క్లబ్‌లో ఉన్న ఫొటోలను విడుదల చేసిన బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. అయితే ఫ్రెండ్ పెళ్లి కోసం రాహుల్ నేపాల్‌కు వెళ్లారని.. అందులో ఎలాంటి తప్పు లేదని కాంగ్రెస్ పేర్కొంది.
