కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకొని నిజమైన పప్పా అవ్వొచ్చని కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే పేర్కొన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగిన సంగతి తెలిసిందే. వీటిలో మూడింట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విషయంపై కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే తాజాగా స్పందించారు.

చాలా మంది రాహుల్ గాంధీని పప్పు అని పిలుస్తుంటారని.. ఇప్పుడు మూడు రాష్ట్రాల విజయంతో రాహుల్ పప్పా(తండ్రి) గా మారారని ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు నిజంగానే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకొని నిజంగా పప్పా(తండ్రి)గా మారొచ్చని ఆయన హితవు పలికారు. 

ఇక బీజేపీ ఓటమి గురించి మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి ప్రధాని నరేంద్రమోదీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.  ఆయా రాష్ట్రాల బీజేపీ నేతల వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యారని అభిప్రాయపడ్డారు.