Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ ఒక ఫెయిల్యూర్ లీడ‌ర్ - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

ఇటీవల లండన్ సదస్సుల్లో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విదేశాల్లో సొంత దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. 

Rahul Gandhi is a failure leader - Madhya Pradesh CM Shivraj Singh Chouhan
Author
Hyderabad, First Published May 22, 2022, 3:08 PM IST

రాహుల్ గాంధీ దేశంలోనే అత్యంత విఫ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడు అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయ‌న  నిరాశా, నిస్పృహలు, నిస్పృహలకు లోనైన వ్య‌క్తి అని విమ‌ర్శించారు. ఇటీవ‌ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండ‌న్ లో జ‌రిగిన ఓ స‌మావేశంలో విమ‌ర్శ‌లు కురిపించారు. ఆయ‌న వ్యాఖ్య‌లపై నేప‌థ్యంలో శివ‌రాజ్ సింగ్ చౌహాన్ రాహుల్ గాంధీపై మండిప‌డ్డారు. 

జనాభా నియంత్రణ చట్టం, ఉమ్మడి పౌర స్మృతి తీసుకురండి: ప్రధానికి రాజ్ ఠాక్రే విజ్ఞప్తి

రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేశార‌ని, ఇలా ఏ రాజ‌కీయ నాయ‌కుడు సొంత దేశాన్ని విమ‌ర్శించ‌ర‌ని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తాను అమెరికా పర్యటనలో ఉన్నానని, అక్కడ పాత్రికేయులు భారత ప్రధాని అండర్-అచీవర్ కాదా అని అడిగారని గుర్తు చేశారు. అయితే తాను మ‌న్మోహ‌న్ సింగ్ కేవ‌లం కాంగ్రెస్ కు మాత్ర‌మే కార‌ని, ఆయ‌న దేశానికి ప్ర‌ధాని అని, ఆయ‌న అండర్-అచీవర్ కాలేరని తాను చెప్పానని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పుడు తాము దేశాన్ని ఎప్పుడూ విమర్శించలేదని రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 

విదేశాల్లో ఉన్నప్పుడు సొంత దేశంపై ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదని శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లోనే ఇలాంటి ప్రకటనలు చేస్తారని, భారతదేశంలో తన మాట ఎవరూ వినరని మధ్యప్రదేశ్ సీఎం అన్నారు. రాహుల్ గాంధీ చాలా అపరిపక్వంగా ఉన్నారని ఆయ‌న విమ‌ర్శించారు. 

లండ‌న్ స‌ద‌స్సులో రాహుల్ గాంధీ ఏమ‌న్నారంటే.. 
లండ‌న్ సిటీలో థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా’’ స‌ద‌స్సు శుక్ర‌వారం నిర్వ‌హించారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రజలు, కులాలు, రాష్ట్రాలు, మతాలను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికార పార్టీ దేశమంతటా కిరోసిన్ పోసిందని, ఒక నిప్పురవ్వ మాత్రమే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంద‌ని చెప్పారు. భార‌త్ ఇప్పుడు మంచి స్థానంలో లేద‌ని అన్నారు. ప్రజలను, కులాలను, రాష్ట్రాలను, మతాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైనా, కాంగ్రెస్ పైనా ఉంద‌ని తెలిపారు. తాము ఈ వేడిని చల్లబరచాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. ఎందుకంటే అది చల్లబడకపోతే అనేక త‌ప్పుడు విష‌యాలు జ‌రుగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. 

కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపండి.. ఏఎస్ఐకి కేంద్రం ఆదేశాలు

భారతదేశంలో రెండు విభిన్నమైన పాలనా విధానాలు ఉన్నాయని, అందులో ఒకటి గొంతులను అణచివేసేదని, మరొకటి వినేదని అన్నారు. ‘‘ బీజేపీ లాంటి క్యాడర్‌ ఉండాలని ప్రజలు అంటున్నారు. కానీ అలాంటి క్యాడర్ ఉంటే మ‌నం బీజేపీయే అవుతామ‌ని నేను వారికి చెబుతున్నాను. భారతీయ ప్రజల భావాలను వినే పార్టీ మాది. BJP గొంతులను అణచివేస్తుంది, మేము వింటాము. దయచేసి గ్రహించండి, BJP అరుస్తుంది. గొంతుల‌ను అణచివేస్తుంది. కానీ మాకు విన‌డ‌మే తెలుసు. అవి రెండు వేర్వేరు విషయాలు. అవి రెండు వేర్వేరు డిజైన్‌లు. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios