Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే సత్తా ఉంది: టీఎంసీ ఎంపీ శతృఘ్నసిన్హా

రాహుల్ గాంధీకి దేశ ప్రధాని అయ్యే సత్తా ఉందని టీఎంసీ ఎంపీ శతృఘ్నసిన్హా అన్నారు. భారత్ జోడో యాత్ర ఒక విప్లవాత్మక, చారిత్రాత్మక యాత్ర అని ఆయన కొనియాడారు. రాహుల్ గాంధీ ఇమేజ్ ఇప్పుడు పెరిగిపోయిందని అన్నారు. 

Rahul Gandhi has the ability to become PM: TMC MP Shathrughan Sinha
Author
First Published Jan 9, 2023, 3:26 PM IST

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఆయనకు ప్రధాన మంత్రి అయ్యే సత్తా ఉందని కొనియాడారు. ‘‘రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే సత్తా ఉంది. ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తులు ప్రధానిగా దేశానికి సేవ చేశారు. దేశాభివృద్ధికి దోహదపడ్డారు’’ అని అన్నారు.

ప్రధాని మోడీ వైద్యానికి సొంత డబ్బులే ఉపయోగిస్తారు.. ప్రభుత్వం భరించడం లేదు - ఆర్టీఐ ద్వారా వెల్లడి

రాహుల్ గాంధీ తన ఇమేజ్‌ను మెరుగుపరుచుకున్నారని, చాలా సీరియస్ నాయకుడిగా ఎదిగారని శత్రుఘ్న సిన్హా అన్నారు. ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. ‘‘రాహుల్ గాంధీ యూత్ ఐకాన్‌గా ఎదిగారు. గతంలోలా కాకుండా ఇప్పుడు ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. కొంతమంది రాహుల్ గాంధీ ఇమేజ్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆయన దేశానికి చాలా సీరియస్ లీడర్‌గా ఎదిగాడు’’ అని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న శతృఘ్నసిన్హా భారత్ జోడో యాత్రని కొనియాడారు. ఈ యాత్ర విప్లవాత్మక, చారిత్రాత్మక యాత్ర అని అన్నారు. ఈ పాదయాత్ర రాబోయే లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని తెలిపారు.

శత్రుఘ్న సిన్హా తన పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కూడా ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక ఉక్కు మహిళ అని, 2024 లోక్‌సభ ఎన్నికలలో గేమ్ ఛేంజర్‌గా ఉద్భవిస్తారని అన్నారు. ‘‘ సంఖ్యల ఆధారంగా మమతా బెనర్జీ 2024లో గేమ్ ఛేంజర్‌గా ఎదుగుతారు. మమతా బెనర్జీ ఒక ఉక్కు మహిళ. ఇప్పుడు ఆమెను ఎవరూ తేలికగా తీసుకోలేరు’’ అని ఆయన అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios