న్యూఢిల్లీ: పైలెట్ కావాలనుకొంటున్న ఓ చిన్నారిని రాహుల్ గాంధీ  విమానంలో తిప్పాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది.   కేరళ రాష్ట్రంలో  రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో కన్నూరు జిల్లాలోని  ఇరిట్టి ప్రాంతంలో అద్వైత్ అనే 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిశాడు. 

నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకొంటున్నావని రాహుల్ గాంధీ ప్రశ్నించాడు.  అయితే పైలెట్ కావాలనుకొంటున్నానని  ఆయన చెప్పాడు.  ఆ మరునాడే రాహుల్ గాంధీ అద్వైత్ ను కాలికట్ విమానాశ్రయానికి తీసుకెళ్లి విమానం ఎక్కించాడు.

అక్కడ పైలెట్ తో కలిసి కాక్ పిట్ గురించి వివరించాడు. ఏ కల పెద్దది కాదు. అద్వైత్ తన కలను నిజం చేసుకొనేందుకు  చిన్న సాయం చేసినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడు అతను ఎగరడానికి అన్ని అవకాశాలు లభించే సమాజాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ లో  అభిప్రాయపడ్డారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.