న్యూఢిల్లీ: చౌకీదారు వివాదం విషయంలో   కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై  సుప్రీంకోర్టు సీరియస్ అయిన ఘటన మరువక ముందే ఈసీ కూడ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.  మోడీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఈసీ ఈ నోటీసులను గురువారం నాడు  జారీ చేసింది.ః

 గిరిజనులను కాల్చిపారేసేలా  మోడీ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకురానుందని  రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై  ఈసీ షోకాజ్  నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని  ఈసీ ఆదేశించింది. లేకపోతే  చర్యలు తీసుకొంటామని  ఈసీ చెప్పింది.

ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదో‌ల్‌లో  ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ  బీజేపీ సర్కార్ ‌పై విమర్శలు చేశారు. గిరిజను కోసం మోడీ తీసుకొచ్చే చట్టం గురించి   ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గిరిజనులను కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారని రాహుల్  ఈ సభలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈసీ ఈ మేరకు గురువారం నాడు రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.