సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ నిర్ణయించారు. సోనియాతో పాటు పార్టీ పెద్దలు వారించినప్పటికీ ఆయన మాత్రం అధ్యక్షుడిగా కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు.

ఈ క్రమంలో తదుపరి అధ్యక్ష ఎన్నికపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఏ వ్యవస్థలోనైనా జవాబుదారీతనం ఉండాలని... అలాగే పార్టీలోనూ... కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి ఎంపికలోనూ తాను భాగం కాదలుచుకోలేదని రాహుల్ స్పష్టం చేశారు.

ఆ విషయంలో తన జోక్యం అనవసరమని... తన జోక్యం ఉంటే ఎలా ఉంటుందో చెప్పలేనని అధ్యక్షుడిగా సరైన వ్యక్తిని పార్టీయే ఎంపిక చేస్తుందని రాహుల్ తెలిపారు.