Asianet News TeluguAsianet News Telugu

జాతీయ భాషగా హిందీ అంశంపై రాహుల్ గాంధీ స్పందన.. ఏమన్నాడంటే?

రాహుల్ గాంధీ జాతీయ భాషగా హిందీ అనే ప్రతిపాదనపై స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరి మాతృభాష ముఖ్యమే అని పేర్కొన్నట్టు వివరించారు.
 

rahul gandhi clarifies stand on hindi as national language issue
Author
First Published Oct 8, 2022, 2:05 PM IST

బెంగళూరు: బీజేపీ ప్రభుత్వం జాతీయ భాషగా హిందీ అనే అంశాన్ని ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఇందుకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో చేరుకున్నారు. అక్కడ స్థానిక నేతలతో ఆయన సమావేశమై చర్చలు జరిపారు.

‘కన్నడ అస్తిత్వం గురించి రాహుల్ గాంధీతో చర్చ జరిగింది. ప్రతి ఒక్కరి మాతృభాష ముఖ్యమైనదే అని అప్పుడు రాహుల్ గాంధీ అన్నారు. మేం అన్ని భాషాలను గౌరవిస్తాం. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నది’ అని రాహుల్ గాంధీ చెప్పినట్టు పార్టీ నేత,మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే విలేకరులకు వెల్లడించారు.

కాబట్టి, కేవలం హిందీ భాషనే జాతీయ భాషగా చేసే ఉద్దేశ్యమేమీ లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జీ ఖర్గే తెలిపారు. కన్నడ భాష అస్తిత్వానికి ఎలాంటి ముప్పు లేదని వివరించారు.

రాహుల్ గాంధీతో సమావేశమైన వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాదని ధ్రువీకరించినట్టు ఆయన తెలిపారు. కానీ, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి వారు ఈ యాత్రలో పాల్గొన్నట్టు తెలిపారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios