Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో యాత్ర: కన్యాకుమారిలో ప్రారంభించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను బుధవారం నాడు ప్రారంభించారు. 150 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. 

Rahul Gandhi Begins Bharat Jodo Yatra In Kanyakumari
Author
First Published Sep 7, 2022, 5:00 PM IST

చెన్నై: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి  భారత్ జోడో యాత్రను బుధవారం నాడు ప్రారంభించారు. 150 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. దేశంలోని పలు రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగుతుంది.  కన్యాకుమారిలోని గాంధీ మండపం నుండి బీచ్ రోడ్డు వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ లు రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందించారు.జాతీయ జెండాను అందుకుని పాదయాత్రను రాహుల్్ గాంధీ  పాదయాత్ర ప్రారంభించారు.

118 మందితో భారత్ జోడో యాత్ర  టీమ్ ను  కాంగ్ఏరెస్ర్పా పార్టీ   చేసింది..ఈ టీమ్ లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నారు.  కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర కాశ్మీర్ లో పూర్తి కానుంది. 150 రోొజుల పాటు 3574కి.మీ సాగనుంది. 

ప్రతి రోజూ రెండు విడతలుగా ఈ యాత్ర సాగనుంది. ఉదయం ఏడు గంట నుండి పదిన్నర గంటల వరకు యాత్ర సాగుతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటల నుండి  ఆరున్నర గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ప్రతి రోజూ కనీసం 26 కి.మీ. నడవాలని ప్లాన్ చేశారు. అయితే ప్రతి రోజు సగటున 23.5 కి.మీ నడిచేలా రూట్ మ్యాప్ లు సిద్దం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దేశాన్ని ఏకం చేసేందుకు ఈ యాత్ర దోహద పడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్న నిరుత్సాహన్ని పోగొట్టి ఉత్సాహం నింపేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు. తమిళనాడు. కేరళ, కర్ణాటక, తెలంగాణ , మహారాష్ట్రల మీదుగా యాత్ర సాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 24న రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. 

also read:'నాడు నా తండ్రిని కోల్పోయాను. కానీ, నేడు నా దేశాన్ని వదులుకోవ‌డానికి సిద్దంగా లేను'

3574 కి.మీ. సుదీర్థ పాదయాత్రను గత శతాబ్దంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇవాళ ఉదయం శ్రీపెరంబూర్ లో రాజీవ్ గాంధీ మరణించిన స్మారక చిహ్నం వద్ద  రాహుల్ గాంధీ నివాళులర్పించారు. అక్కడి నుండి కన్యాకుమారికి చేరుకున్నారు. కన్యాకుమారిలో వివేకానంద మెమోరియల్ ను సందర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios